Telugu

జగన్ కార్ వెనుక సీట్లో కూర్చొనిస్తే చాలట!

గుడివాడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించడంలో ముందు వరుసలో ఉంటారు. చంద్రబాబు నాయుడుని విమర్శించడం అనేది జగన్ మోహన్ రెడ్డికి ఎంతో ఇష్టమైన పని కాబట్టి రోజా, నాని వంటివారు దానికి పోటీ పడతారు.

అయితే ఇవన్నీ మంత్రి పదవి కోసం కాదు అంటున్నారు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ అదికారంలోకి వస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారని, ఆయన వాహనంలో వెనుక సీటు ఉంటే చాలని ఆయన అన్నారు. జగన్ తనను సోదర సమానంగా చూసుకుంటున్నారని, తను ఎన్నటికి జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

తనకు మంత్రి పదవి ఈక ముక్కతో సమానమని ఆయన అన్నారు. జగన్ హృదయంలో చోటు ఉంటే చాలని ఆయన చెప్పుకొచ్చారు. 2019లో వైకాపా పవర్ లోకి వస్తే తనను అత్యధిక సార్లు గెలిపించిన గుడివాడను పులివెందులతో సమానంగా అభివృద్ధి చేస్తా అని చెప్పుకొచ్చారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Srilatha from Idupu Kayitham: A Song Everyone Will Enjoy

The makers of Idupu Kayitham have released the first single, Srilatha. The song is filled…

8 seconds ago

Prime Video’s Big Budget Disaster: 8 Episodes of Torture?

The Revolutionaries, Nikkhil Advani’s latest period series on India’s armed freedom struggle, has received a…

31 minutes ago