నేను ‘కాపు’ వాడ్ని కాదు, ‘కాపు’ కాసే వాడ్ని – పవన్!

వర్తమాన రాజకీయ సామజిక అంశాలను తన సినిమాలలో ఏదొక సందర్భంలో పలికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో చెలరేగిన కుల రాజకీయాలపై సెటైరికల్ డైలాగ్స్ వేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణాలో రోహిత్ ఆత్మహత్య నేపధ్యంలో రాజుకున్న కుల వివాదం, అలాగే ఏపీలో కాపులను బీసీల్లోకి చేర్చాలంటూ చెలరేగిన విధ్వంసం తెలిసిందే.

స్వతహాగా ‘కాపు’ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్, కాపుల ఉద్యమానికి మద్ధతు ఇవ్వలేదన్న ఆవేదన, ఆగ్రహం సదరు సామాజిక వర్గానికి చెందిన కొంతమందిలో ఉంది. అయితే తనకు కులంతో సంబంధం లేదని, కుల రాజకీయాల్లోకి తనను లాగవద్దని పవన్ ‘జనసేన’ ఏర్పాటైన తొలిరోజే ప్రస్తావించారు. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కూడా ఇదే రకమైన భావాలను వ్యక్తపరిచారు.

ADVERTISEMENT

అయితే పరోక్షంగా అదే అర్ధాలు వచ్చే విధంగా తన లేటెస్ట్ సెన్సేషన్ “సర్ధార్ గబ్బర్ సింగ్” చిత్రంలో కూడా పలు డైలాగ్స్ పెట్టినట్లుగా సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. ఒక సందర్భంలో “నేను కాపు వాడ్ని కాదు, కాపు కాసే వాడ్ని” అంటూ పవన్ చెప్తారని, ఇవి వర్తమాన రాజకీయాలకు ప్రతిబింబించే విధంగా ఉంటాయని, అలాగే సినిమాలో పవన్ ధరించిన పోలీస్ పాత్రకు కూడా ఈ డైలాగ్స్ సరిపోతాయని, “కాపు కాసే వాడు” అంటే రక్షకభటుడేనని…. ఈ డైలాగ్స్ కు ‘సర్ధార్’ నోటి వెంట వచ్చేవే అని అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేసే ఇలాంటి పంచ్, సైటైరికల్ డైలాగ్స్ ను వెండితెరపై వీక్షించాలంటే ఏప్రిల్ 8వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.!

Share
Published by

Recent Posts

తెలంగాణలో మైండ్ గేమ్ పాలటిక్స్.?

తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…

13 minutes ago

జగన్‌ వార్నింగ్ ఇస్తే చంద్రబాబు దిగొచ్చారటగా?

అవును! నిజమే! జగన్‌ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…

17 minutes ago