Telugu

టాలీవుడ్‌కి పీడకల.. ప్రేక్షకులకు రాబిన్‌హుడ్!

ఐబొమ్మతో కొత్త సినిమాలు ఫ్రీగా చూపిస్తున్న ఇమ్మడి రవి చట్ట ప్రకారం నేరస్తుడు. కానీ ఇష్టారాజ్యంగా సినిమా టికెట్ ఛార్జీలు పెంచేస్తున్న బడా నిర్మాతలను, ఐబొమ్మతో దోచుకొని సామాన్య ప్రేక్షకులకు ఉచితంగా సినిమాలు అందిస్తున్న అతను రాబిన్‌హుడ్‌ వంటివాడు.. అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

అసలు అతనికి సోషల్ మీడియాలోఇంత మద్దతు లభిస్తుందని ఊహించని సినీ ప్రముఖులు, పోలీసులు కూడా కంగు తిన్నారు. కనుక రెట్టింపు స్వరంతో అటువంటి వాదనలు ఖండిస్తున్నారు. ఒక నేరగాడిని సమర్ధించి హీరోని (రాబిన్‌హుడ్‌) చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

ADVERTISEMENT

సినీ పరిశ్రమ వాదన:

వందల కోట్లు బడ్జెట్‌తో సినిమాలు తీసిన సినిమాలు థియేటర్లలోకి రాక మునుపే ‘ఐ బొమ్మ’తో చూపిస్తుంటే ఇక ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు వస్తారు?

ఓ పక్క ఓటీటీలు, నెగెటివ్ రివ్యూలు సినీ పరిశ్రమకి పెను సమస్యగా ఉండగా, మరో పక్క ఈ ‘ఐబొమ్మ’ వంటి పైరసీ సంస్థల వలన వందల కోట్ల నష్టం జరుగుతోంది.

వందల మంది రేయింబవళ్ళు కష్టపడి తీస్తున్న సినిమాలను ఈవిదంగా దెబ్బ తీస్తుంటే వందల మంది కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడతాయి. కనుక పైరసీదారులను కటినంగా శిక్షించాల్సిందే అని సినీ ప్రముఖులు వాదిస్తున్నారు.

రాబిన్‌హుడ్‌ అభిమానుల వాదనలు:

వందల కోట్ల బడ్జెట్‌ పెట్టి సినిమాలు తీయమని ప్రేక్షకులేమీ పట్టుబట్టడం లేదు కదా?మరెందుకు తీస్తున్నారు?తక్కువ బడ్జెట్‌తో మంచి సినిమాలు తీస్తే చూసి ఆదరిస్తూనే ఉన్నాము కదా?

చిన్న సినిమాలు టికెట్ ఛార్జీలు పెంచకుండానే లాభాలు గడిస్తున్నప్పుడు, వందల కోట్లు పెట్టి తీస్తే అవి ప్రేక్షకులకు నచ్చితే ఎందుకు లాభాలు రావు? కానీ టికెట్ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారు?

హీరోలు, దర్శకులకు వందల కోట్ల పారితోషికాలు ఇస్తున్న నిర్మాతలు, సినీ కార్మికులు జీతాలు పెంచమంటే షూటింగులు బంద్‌ చేస్తున్నారు కదా?

అప్పుడు వాళ్ళ గురించి ఆలోచించని మీరు, ఇప్పుడు మొసలి కన్నీళ్ళు పెట్టుకుంటే నమ్మశక్యంగా ఉందా?అయినా మీరు బడ్జెట్‌ పెంచేసుకొని, మీ అభిమానులను మీరే దోచుకోవడం సబబుగా ఉందా?

టికెట్ ఛార్జీలకు తోడు థియేటర్లలో మంచి నీళ్ళ బాటిల్స్, కూల్ డ్రింకులు, రుచీ పచీ లేని సమోసాలు, పఫ్‌లు, పాప్‌కార్న్… ఇలా ప్రేక్షకులకు దోచుకుంటూనే ఉన్నారు కదా?

ఇంత ఖర్చు చేసినా మంచి సినిమా చూశామనే సంతృప్తి ఇవ్వగలుగుతున్నారా? లేదు కదా?చెత్త సినిమాలు తీసి ప్రేక్షకులను దోచుకుంటున్నారు. ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా చేసుకుంటున్నది మీరే. మీ సినిమాలకు, సినీ పరిశ్రమలో కార్మికులకు నష్టం చేసుకుంటున్నది కూడా మీరే!

కనుక మీ దోపిడీ నుంచి సామాన్య ప్రేక్షకులను కాపాడి మిమ్మల్ని దోచుకొని వారికి న్యాయం చేస్తున్న మా రాబిన్‌హుడ్‌ని నేరస్తుడు ఎలా అవుతాడు? అనే వాదనలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.

కానీ చట్టం పని చట్టం చేసుకుపోతుంది కనుక ఐబొమ్మ మూతపడింది. ఇమ్మడి రవితో సహా పలువురు జైలుకి వెళ్ళవచ్చు.

కానీ ఇక్కడితో ఈ ఐబొమ్మ సినిమా ముగుస్తుందా? అంటే కాదనే అందరికీ తెలుసు. ‘డిమాండ్ అండ్ సప్లై’ ప్రకారం ఐబొమ్మ కాకపోతే జేబొమ్మ లేదా మరోబొమ్మ పుట్టుకొస్తూనే ఉంటుంది. నెలరోజులు సినిమా షూటింగులు ఆపేస్తే సినీ పరిశ్రమలో సమస్యలన్నీ పరిష్కారం కాలేదు కదా? అలాగే ఇదీను!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

No Stunt Doubles, Sobhita Does It All Herself!

Sobhita Dhulipala is taking on a physically demanding role in Pa. Ranjith’s upcoming Vettuvam, and…

25 minutes ago

Bold Confession: Why Shruti Haasan Stopped Hiding Periods

Shruti Haasan has spoken openly about something many women still hesitate to discuss at the…

34 minutes ago