Telugu

ఇద్దరి లోకం ఒకటే ట్రైలర్… క్యూట్ బట్ రొటీన్

రాజ్ తరుణ్, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ నెల 20న పెద్ద సినిమాల హడావిడి తరువాత క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

కథ విషయానికి వస్తే ఒకేసారి పుట్టి పెరిగిన ఒక ఆడా మగ, కలిసి పెరిగి ఆ తరువాత 18 ఏళ్ల పాటు విడిపోతారు. ఆ తరువాత వారు కలుస్తారు. ఒకరి కంపెనీని ఇంకొకరు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే సరిగా హీరో ప్రపోస్ చేసే సరికి మాత్రం హీరోయిన్ తనకు ఆ ఫీలింగ్ లేదు అంటుంది. దీనితో వారి కథ ఏమవుతుందని అనేది అసలు స్టోరీ.

ADVERTISEMENT

కథ చాలా రొటీన్ గా అనిపిస్తున్నా దర్శకుడు హీరో హీరోయిన్ల మధ్య జరిగే మొమెంట్స్ క్యూట్ గా చూపించాడు. అవి సినిమాలో వర్క్ అవుట్ అయ్యి ఆ తరువాత కాన్ ఫ్లిక్ట్ పాయింట్ కూడా బాగా డీల్ చేస్తే సినిమా వర్క్ అవుట్ అవ్వొచ్చు. ప్రస్తుతానికి మాత్రం సినిమా మీద ఎటువంటి హైప్ లేదు. మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది.

కాగా ఈ సినిమాలో నాజర్, మాస్టర్ భరత్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఆడు మగాడ్రా బుజ్జి ఫేం జీఆర్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సక్సెస్‌ ఫుల్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దిల్ రాజు సినిమా కావడం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

క్యాడర్ కుస్తీలు…అధినేతల భేటీలు

స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇన్నేళ్ల స్నేహాన్ని విరోధంగా మార్చేసింది. ఇరు పార్టీల మధ్య…

2 minutes ago

CSK Star Ruled Out for 3 Months: IPL 2027 in Doubt?

Chennai Super Kings (CSK) have suffered a setback ahead of IPL 2027, as Ayush Mhatre…

14 minutes ago