Telugu

మరో ‘అందాల రాక్షసి’..!

హను రాఘవ పూడి తన సినిమాలలో వెండి తెరకు నూతన నటీమణులను పరిచయం చేస్తూ వారి కెరియర్ లో గుర్తుండిపోయే సినిమాగా తన సినిమాను నిలుపుకుంటారు. హీరోలకు సమానంగా హీరోహీన్ లకు స్రీన్ షేర్ తో పాటు సమాన పాత్ర కల్పిస్తారు. ఆయన మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ తో లావణ్య త్రిపాఠిని ఇండస్ట్రీకి పరిచయం చేసారు హను.

ADVERTISEMENT

రాహుల్, నవీన్ చంద్ర, లావణ్య మధ్య సాగే ట్రైయాంగిల్ లవ్ స్టోరీ లో లావణ్య పోషించిన ‘మిథున’ పాత్ర ఇప్పటికి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. మిథునగా లావణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్షకుల మదిలో ఒక అందాల రాక్షసిగా ఎప్పటికి గుర్తుండిపోతుంది. అటు అమాయకత్వం ఇటు గడుసుతనంతో లావణ్య నటన మణిరత్నం ‘గీతాంజలి’ లో గిరిజ పాత్రను గుర్తు చేసింది.

అలాగే ‘పడి పడి లేచే మనస్సు’లో సాయిపల్లవి ‘వైశాలి’తో మరోమెట్టెక్కింది. ఇక ‘లై’ తో ‘చైత్ర’గా మేఘ ఆకాష్ ,’కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో ‘మహాలక్ష్మి’ గా మెహరీన్ ఇండస్ట్రీకి పరిచయం చేసి మొదటి సినిమాతోనే చెప్పానుగా నీకు చెప్పాను గా అంటూ సూపర్ హిట్ అందించారు. సెలక్టివ్ గా సినిమాలు తీసుకుంటూ ఒక్కో సినిమాలో ఒక్కో న్యూ టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు హను.

ఇక లేటెస్ట్ సెన్సేషన్ ‘సీత రామం’ తో యుద్ధంతో మొదలైన ప్రేమ కథ అంటూ ‘సీత’గా మృణాల్ ఠాగూర్ ను టాలీవుడ్ కు పరిచయం చేసారు. అలాగే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవ పూడి కాంబోలో రాబోతున్న మూవీ కి గాను సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ ని ఎంపిక చేసుకుని సినీ ప్రపంచానికి మరో అందాల రాక్షసిని పరిచయం చేయబోతున్నారు.

తన మొదటి సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పక్కన నటించే అవకాశం దక్కించుకున్నారు ఇమాన్వీ. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఇమాన్వీ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం అందిపుచ్చుకున్నారు. ఈ అవకాశం దక్కించుకోవడంతోనే స్టార్ హీరోహిన్ హోదా కొట్టేసింది ఈ అమ్మడు.

ఇక అనుకున్నట్లు ఈ మూవీ ప్రభాస్ రేంజ్ హిట్ అందుకుంటే ఇమాన్వీ క్రెజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతుంది. తానూ చేస్తున్న ప్రతి సినిమాలో ఒక్కో అందాల రాక్షసిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ హీరోహీన్స్ పాలిట గోల్డెన్ హ్యాండ్ గా, లక్కీ బాయ్ గా మారిపోయారు హను రాఘవ పూడి. అయితే హను ఇచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ ని సర్రిగ్గా వినియోగించుకోలేక లావణ్య, ఆకాష్ మేఘ, మెహరీన్ వంటి భామలు ఇండస్ట్రీకి దూరమయ్యారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

No Guarantee for Ro-Ko in WC 2027? BCCI Chief Reveals

Virat Kohli and Rohit Sharma’s chances of playing in the 2027 ODI World Cup remain…

7 minutes ago

Prabhas vs Salman Clash: What’s Vanga Planning?

After the success of Animal, audiences are eagerly waiting to see what Sandeep Reddy Vanga…

22 minutes ago