
దానికి సమాధానం ఇవ్వకపోవడంతో విశాల్‌పై చర్యలు చేపట్టాలంటూ ఎగ్మూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. అప్పట్లో దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు ఆగస్టు 2న విచారణకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలంటూ విశాల్‌ను ఆదేశిస్తూ సమను పంపింది. అయితే శుక్రవారం విశాల్ హాజరు కాలేదు. ఆయన తరపున ఆయన న్యాయవాదిని మాత్రమే పంపారు. ఐటీ అధికారులు పంపిన నోటీసు విశాల్‌కు అందలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నేరుగా హాజరుకావడం నుంచి విశాల్‌కు మినహాయింపు కల్పించాలని కోరారు.
అయితే తమ ఆదేశాలను ధిక్కరించినందుకు ఆగ్రహించిన న్యాయమూర్తి వాదనలను పూర్తయిన తరువాత విశాల్‌కు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. విశాల్ సినిమాల విషయానికొస్తే… ఆయన నటించిన తమిళ చిత్రం ‘అయోగ్య’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. తెలుగు మూవీ ‘టెంపర్’ రీమేక్. త్వరలో సుందర్ సి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…
A massive data leak at the Central Board of Film Certification (CBFC) has exposed records…