
గత కొన్నేళ్లుగా రామానాయుడు స్టూడియోకు సంబంధించి సరైన పత్రాలు దాఖలు చేయకపోవడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహించినట్టు చెబుతున్నారు. ఈ సోదాల్లో సురేష్ బాబు కార్యాలయాల్లోని కొన్ని కీలక పత్రాలను హార్ట్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సురేష్ బాబు దేశంలో లేరు.
సురేష్ బాబు టాలీవుడ్ లో సీనియర్ నిర్మాత. హైదరాబాద్, విశాఖపట్నం నగరాలలో రామానాయుడు స్టూడియోలు నడుపుతున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సినిమా థియేటర్లు నడుపుతున్నారు. పలు చిన్న సినిమాలు ఆయన విడుదల చేస్తున్నారు. వెంకటేష్, నాగచైతన్యలతో వెంకీమామ సినిమాకు ఆయన సహా నిర్మాతగా ఉన్నారు. డిసెంబర్ 13న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు వెంకటేష్ తో అసురన్ రీమేక్ ప్రకటించారు. ఇది అలా ఉండగా వారం రోజుల క్రితమే సురేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు ధియేటర్లులలో పనిచేసేవారికి జీతాలు ఇవ్వడం కాదు కదా కనీసం కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని స్థితిలో ధియేటర్లు నష్టాల్లో నడుస్తున్నాయని చెప్పడం విశేషం.
One issue becoming impossible to ignore in the cinema industry is the growing fear surrounding…
తమిళనాడు ఎన్నికల ఫలితాల తరువాత విజయ్ టీవీకే పార్టీ గెలుపును ఆ పార్టీ అభిమానులు జరుపుకున్న దానికంటే కాస్త అధికంగానే…