Telugu

ఆసీస్ ను కొట్టాల్సిందే… ఇండియాకు మరో ఆప్షన్ లేదు..!

ఆస్ట్రేలియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫలితంతో పాకిస్తాన్ జట్టుకు ఒక స్పష్టత వచ్చినట్లయింది. ఓటమి భారంతో పాక్ టోర్నీ నుండి అవుట్ కాగా, సెమీస్ చేరుకునే అవకాశాలను ఆసీస్ మెరుగుపరుచుకుంది. దీంతో ఈ ఆదివారం 27వ తేదీన జరగనున్న ఆస్ట్రేలియా – ఇండియా జట్ల మ్యాచ్ కోసం ఎదురు చూడడం అభిమానుల వంతయ్యింది. ఈ మ్యాచ్ జరగడం ఆసీస్ కంటే ఇండియాకే అత్యంత కీలకం.

ఒకవేళ వర్షం వలన గానీ లేక ఏ ఇతర కారణాల వలన గానీ ఈ మ్యాచ్ రద్దయితే… ఆసీస్ జట్టుకున్న మెరుగైన రన్ రేట్ రీత్యా భారత్ టోర్నీ నుండి తప్పుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగి, ఇండియా సొంతం కావాలని సగటు క్రీడాభిమాని కోరుకుంటున్నాడు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ తో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆసీస్ బ్యాట్స్ మెన్లు పాక్ బౌలర్లను చీల్చి చెండాడారు.

ADVERTISEMENT

తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఏకంగా 193 పరుగుల భారీ స్కోరు సాధించడంతో భారీ లక్ష్యం పాక్ ముందుంది. స్మిత్ 61 పరుగులతో రాణించగా, చివర్లో వాట్సన్ 44 పరుగులతో చెలరేగిపోయాడు. తదనంతరం బ్యాటింగ్ దిగిన పాక్ ఏ దశలోనూ ఆసీస్ కు గట్టి పోటీ ఇచ్చే ప్రదర్శనను ఇవ్వలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు పడుతూ, చివరికి 172 పరుగుల వద్ద స్కోర్ కార్డును ముగించింది. అది కూడా చివర్లో షోయబ్ మాలిక్ 20 బంతుల్లో 40 పరుగులు చేయడంతో గౌరవప్రదమైన స్కోర్ ను చేయగలిగింది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Pics: Aarti Flaunts Hot Curves In Red Saree Look

Aarti Chikara is taking the internet by storm with a stunning new editorial shoot that…

16 minutes ago

KCR Is Coming Out of Farmhouse: Is Padayatra His Comeback Plan?

KCR appears ready to take his political fight against the Revanth Reddy government back to…

46 minutes ago