
India vs Mohsin Naqvi Asia Cup Trophy Row
ఇటీవలే ముగిసిన మహిళా ఆసియ కప్ ను ఘనమైన విజయంతో ముగించి, ఛాంపియన్స్ గా నిలిచింది భారత మహిళా జట్టు. అయితే, సంవత్సర కాలం ముందు మన భారత మెన్స్ జట్టు కూడా ఆసియ కప్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు, సంవత్సరం ముందు జరిగిన మెన్స్ ఆసియ కప్ ప్రస్తావన ఎందుకు ట్రెండ్ అవుతోందని అందరు అనుకుంటూ ఉన్నారు.
కాగా, ఇటీవల భారత మహిళలు ఆసియ కప్పు కు ఛాంపియన్స్ గా నిలిచిన పిమ్మట ట్రోఫీ ను అందుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మరియు ఆసియ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మొహసిన్ నక్వీ, ట్రోఫీ ను తన చేతి నుండే అందుకోవాలి అంటూ మరోసారి అతని హుందాతనాన్ని దిగజార్చుకున్నారు.
గతేడాది సెప్టెంబర్ లో జరిగిన మెన్స్ ఆసియ కప్పు ఫైనల్ లో అత్యంత ఉత్కంఠ పరిస్థితుల్లో అద్భుతమైన విజయముందుకుని ఛాంపియన్స్ గా నిలిచిన భారత మెన్స్ జట్టుకు కూడా నక్వి ఇదే విధంగా, ‘ట్రోఫీ తన చేతుల మీదగాని అందుకోవాలి’ అంటూ షరతు పెట్టగా, దానికి భారత జట్టు ఖండిస్తూ తమకు ట్రోఫీ అవసరం లేదంటూ చేతిలో ట్రోఫి లేకుండానే ఛాంపియన్స్ గా ఫోటోలకు పోజులు ఇచ్చి సెలెబ్రేట్ చేసుకున్నారు టీం ఇండియా.
అయితే, ట్రోఫీ ను నిరాకరించిన కారణంగా ఆసియ కప్పు ట్రోఫీ ను తనతోపాటు వెంట పెట్టుకుని తన ఆఫీస్ తో పట్టుకెళ్లి, అక్కడినుండి ఒక లేఖ రాసి పంపారు. ‘ట్రోఫీ కావాలనుకున్న వేళ, ఏ.సి.సి ఆఫీస్ కు వచ్చి తమ ట్రోఫీ ను పట్టుకెళ్లాల్సింది’ గా ఆ లేఖ లో వివరించారు. దీనికి భారత జట్టు స్పందించకున్నా, ట్రోఫీ తిరిగి తెచ్చుకునేందుకు బీసీసీఐ ఏ చర్య చేయలేదు. దీనితో, అప్పట్లో నక్వి నుండి ఇది చాలా చిన్నతనపు చర్య గా భావించారు.
అయితే మళ్ళీ సరిగ్గా సంవత్సర కాలం తరువాత అదే ఆసియ కప్ టోర్నీ ను భారత్ మళ్ళీ చేజిక్కించుకుంది. అయితే ఈసారి ఫైనల్ లో శ్రీలంక మహిళల పై 72 పరుగుల ఘన విజయాన్ని అందుకుని, చాలా ఆధిపత్య ఆటతీరుతో సునాయాసంగా ఛాంపియన్స్ గా నిలిచింది భారత జట్టు. మ్యాచ్ ముగిసిన తరువాత సెలెబ్రేషన్స్ ఓ కొలిక్కి వచ్చి, ట్రోఫీ ను అందుకునే సమయంలో మళ్ళీ మొహసిన్ నక్వీ పోడియం మీదనుండి ట్రోఫీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
మరోసారి భారత జట్టు నక్వి చేతులమీదిగా ట్రోఫీ ను అందుకోబోము అంటూ వరుసగా 2వ సారి భారత్ ఆసియ కప్ ట్రోఫీ ను నిరాకరించారు. తొలుత మెన్స్ జట్టు ఖండించగా, అదే బాటలో ఉమెన్స్ జట్టు కూడా నడుస్తూ, మ్యాచ్ ముగిసాక కాన్ఫరెన్స్ లో కోచ్ ‘ఇది బీసీసీఐ నుండి వచ్చిన ఆదేశం మాత్రమే, మేము దానినే ఆచరిస్తున్నాము’ అంటూ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
అయితే, మునుపెన్నడూ లేని ఈ ట్రోఫీ వివాదం గత రెండేళ్ళగానే నడుస్తుంది. గతేడాది ఆపరేషన్ సింధూర్ తరువాతి నుండే పాక్ పై వేటు వేసింది మన ప్రభుత్వం మరియు బీసీసీఐ. నక్వి మరోసారి ట్రోఫీ ను వెంబడపెట్టుకుని తీస్కువెళ్లినప్పటినుండి ‘గత 25 ఏళ్లగా పాక్ గెలిచింది 1 ఆసియ కప్, పట్టుకెళ్లింది 2 కప్పులు’ (2025 భారత మెన్స్ ట్రోఫీ, 2026 మహిళల ట్రోఫీ) అంటూ అభిమానులు సోషల్ మీడియాలో నక్వీ పై సెటైర్లు వేస్తున్నారు.
India won the Women's Asia Cup after beating Sri Lanka in the final, but the…
Kiran Abbavaram’s new project #KA13 has embraced the festive spirit with a special Vinayaka Chavithi…