
ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ) ఒప్పందం అమలుకు సంయుక్త తీర్మానంపై భారత్ – స్విట్జర్లాండ్ మంగళవారం నాడు ఆమోదం తెలిపాయి. ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి చైర్మన్ సుశీల్ చంద్ర, స్విస్ దౌత్య కార్యాలయ ఉన్నతాధికారి గిల్స్ రౌడిట్‌లు ఈ తీర్మానంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సెప్టెంబరు 2018 తర్వాత స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న భారతీయుల ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ వెల్లడించనుంది.
సెప్టెంబరు 2019 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, స్విస్ బ్యాంకుల్లోని ఖాతాల్లో భారతీయులు దాచుకున్న నల్లడబ్బు వివరాలను స్విస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు భారత్‌కు అందిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఒప్పందంపై స్విట్జర్లాండ్ ఆర్థిక విభాగం కూడా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఏఈఓఐ అమలుకు స్విట్జర్లాండ్ కట్టుబడి ఉన్నట్టు, మరిన్ని దేశాలకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు వివరించింది.
Nora Fatehi turns a hotel-room backdrop into her own fashion runway, bringing fearless glamour to…
వై నాట్ 175, ప్రతిపక్షం లేని ఏకైక రాష్ట్రం గా ఏపీ, వై నాట్ కుప్పం.? వై నాట్ మంగళగిరి.?…