
మైదానంలో మన భారత ప్లేయర్స్ పెర్పామెన్స్ చూస్తే టీం ఇండియా రెండు వైపులా పదునే అనేది స్పష్టంగా తెలుస్తుంది. ప్రత్యర్థి ప్లేయర్ల బ్యాటింగ్ లైన్ ను కట్టడి చేయడంలోనూ, అలాగే భారత టాప్ ఆర్డర్ కుప్పకూలినా మిడ్ ప్లేయర్స్ ఆటను నిలబెట్టడం వరకు అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను టీం ఇండియా పదునెక్కింది.
ఆట తమ చేజారి ప్రత్యర్థి చేతిలోకి వెళుతుంది అన్న ప్రతి సారి ఆ ఓటమి ఒత్తిడిని తట్టుకుని గెలుపు కసిని తమలో నింపుకుని ఆట ఫలితాన్ని తమకు అనుకూలంగా రాబట్టుకోగలుగుతున్నారు. ఇందుకు తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్పు మ్యాచ్లే చక్కటి ఉదాహరణలు.
ఆసియా కప్పులో ఆడిన అన్ని మ్యాచ్ లలోను భారత టీం ప్రత్యర్థి టీం పై పైచేయి సాధిస్తూ అన్ని మ్యాచ్ లలోను జయకేతనం ఎగరేసి ఆసియా ట్రోఫీని మరోసారి తన ఖాతాలో వేసుకుంది.
సూపర్ -4 లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ దాదాపు ఓటమి అంచులలోకి వెళ్ళిపోయింది అనుకున్నప్పటికీ ఆ ఒత్తిడిని తట్టుకుని తిరిగి పుంజుకుని భారత బౌలర్లు ఆట ఫలితాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు.
ఇక ఇదే టోర్నీ లో భారత చిరకాల ప్రత్యర్థి పాక్ తో పోరాడిన టీం ఇండియా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుని పాక్ ను మైదానంలోను కుప్పకూల్చింది. రెండుసార్లు గెలిచిన గర్వంతో భారత్ మూడోసారైనా పగ తీర్చుకోవాలి అనే కసితో మైదానంలో అడుగుపెట్టారు ఇరు జట్లు.
అయితే ట్రోఫీ చివరి మ్యాచ్ లో సైతం తలపడ్డ భారత్ – పాక్ ఆట చివరి వరకు నువ్వా నేనా అన్నట్టుగా పోరాడినా చివరికి టీం ఇండియా దెబ్బకు పాక్ మరో అపజయం ముందు తలవంచక తప్పలేదు.
అయితే ఈ మ్యాచ్ లో సైతం టీం ఇండియా అటు బౌలింగ్ లోను రాణిస్తూ ఇటు బ్యాటింగ్ లోను తమ సత్తా చూపిస్తూ టీం ఇండియాకు రెండు వైపులా తన పదును తగ్గలేదు అని మరోసారి నిరూపించింది. తమ బ్యాటింగ్ తో విజ్రంభిస్తున్న పాక్ ఆటగాళ్లను తమ బౌలింగ్ తో కట్టడి చేసారు.
అలాగే ఆట మొదటి దశలోనే తమ బౌలింగ్ తో చెలరిగి మూడు వికెట్లు తీసి భారత టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చిన పాక్ బౌలర్లకు తమ బాట్ తో గట్టి బదులు చెప్పి భారత్ కు 9 వ ఆసియా కప్పును అందించారు భారత మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…