
తొలి ఇన్నింగ్స్ లో 215 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా స్కోరుకు బదులుగా దక్షిణాఫ్రికా 79 పరుగులు మాత్రమే చేసిన విషయం తెలిసిందే. 136 పరుగుల లీడ్ తో రెండవ ఇన్నింగ్స్ ఆరభించిన భారత జట్టు 173 పరుగులకు చాపచుట్టేసింది. 310 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు రెండవ రోజు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేసింది. రెండు రోజుల్లోనే ఇంత కధ నడవడంతో, మ్యాచ్ మూడవ రోజుకే ముగిసిపోవడం ఖాయమని తేలిపోయింది.
ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఎల్గర్ (18) అవుటవ్వగా, విధ్వంసకర డివిలియర్స్ (9) పరుగులకే వెనుతిరిగాడు. దీంతో భారత్ విజయం ఖాయమైంది. అయితే ఆమ్లా, డుప్లెసిస్ లు కొంత సేపు టీమిండియా స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్నారు. కానీ, వీరిద్దరినీ మిశ్రా పెవిలియన్ బాట పట్టించాడు. ఇక, మిగతా కధను అశ్విన్ పూర్తి చేసాడు. రెండవ ఇన్నింగ్స్ లో 7 వికెట్లు, మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు నేలకూల్చిన అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో సిరీస్ కూడా సొంతం కావడంతో కోహ్లి సేన సంబరాల్లో మునిగి తేలుతోంది.
Former Pakistan captain Mohammad Yousuf has linked the team’s recent struggles to their famous 10…
Why is Jagan is unusually good when it comes to picking interesting coin terms. There…