
భారత్ అనేక దేశాలతో సుమారు 15 వేల కిమీ పొడవైన సరిహద్దు పంచుకుంటుంది. ముఖ్యంగా పాక్, చైనా, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల సరిహద్దులో గల రాష్ట్రాలు, జిల్లాల ప్రజలు నిత్యం అవి సృష్టించే అనేక సమస్యలతో సతమతమవుతూనే ఉంటారు.
అటువంటి తీవ్రమైన సమస్యలలో ఒకటి డ్రోన్స్ ద్వారా ఆయుధాలు, మాదకద్రవ్యాల సరఫరా అత్యంత తీవ్రమైనది. కనుక సరిహద్దు భద్రత దళాలు రేయింబవళ్ళు ఎంతగా గస్తీ కాస్తున్నప్పటికీ ఎక్కడో అక్కడి నుంచి డ్రోన్స్ ద్వారా ఆయుధాలు, మాదకద్రవ్యాలు మన దేశంలో డ్రాపింగ్ అవుతూనే ఉన్నాయి.
ఢిల్లీ కారు బాంబు దాడి జరిగిన తర్వాత గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కి కారులో ఆయుధాలు తీసుకువెళుతున్న డా.అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ని అరెస్ట్ చేసింది.
అతనిని ప్రశ్నించగా రాజస్థాన్‌లోని పాకిస్తాన్ సరిహద్దు గ్రామమైన హనుమాన్ ఘడ్ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా ఆయుధాలు డ్రాప్ అవుతుంటాయని, వాటిని తాము కలెక్ట్ చేసుకొని దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్న తమ సహచరులకు అందిస్తామని చెప్పారు.
కనుక పొరుగు దేశాల నుంచి డ్రోన్స్ ద్వారా ఆయుధాలు, మాదకద్రవ్యాల కట్టడికి భద్రతా దళాలు కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో యాంటీ డ్రోన్ ఆయుధ వ్యవస్థని మోహరించింది. కానీ అవి ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో అమర్చబడి ఉంటాయి కనుక సమీపంలోనే ఇతర ప్రదేశాలకు తరలించడం సాధ్యపడదు.
ఈ సమస్యకు పరిష్కారంగా హైదరాబాద్‌లోని ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి స్వతంత్రంగా పనిచేసే ‘ఇంద్రజాల్ రేంజర్ వెహికల్’ తయారు చేసింది.
ఇది 10 కిమీ పరిధిలో స్వతంత్రంగా సంచరిస్తూ పొరుగు దేశాల నుంచి వస్తున్న డ్రోన్లని కనిపెట్టి కూల్చివేస్తుంది. దీనిని ప్రయోగాత్మకంగా సరిహద్దు జిల్లాలో మోహరించగా ఆరు రోజుల్లో 70 విదేశీ డ్రోన్లను కూల్చి వేసింది!
ఈ లెక్కన పొరుగు దేశాల నుంచి ఏటా డ్రోన్ల ద్వారా ఎన్ని ఆయుధాలు, మాదకద్రవ్యాలు దిగుమతి అవుతున్నాయో ఊహించుకోవచ్చు.
అత్యాధునిక ఏఐ, హ్యాకింగ్, సైబర్ ట్రిగర్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ ‘ఇంద్రజాల్ రేంజర్ వెహికల్’ ప్రయోగాలు విజయవంతం అవడంతో నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే ఆవిష్కరించారు. సరిహద్దు భద్రతా దళాలకు అవసరం మేరకు వీటిని ఉత్పత్తి చేసి అందిస్తామని ఇంద్రజాల్ డ్రోన్స్ డిఫెన్స్ కంపెనీ సీఈవో కిరణ్ రాజు చెప్పారు.
Nikhil Siddhartha is preparing for his upcoming film, Swayambhu. The makers are working to bring…
GV Prakash is having the kind of year that can easily be called a golden…