
ఉమేష్ యాదవ్ వేసిన బంతిని ఆడకుండా వదిలేయగా, అది వచ్చి ప్యాడ్లను తాకడం, టీమిండియా ‘అవుట్’ అంటూ అప్పీల్ చేయడం, ఎంపైర్ అవుట్ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే రిప్లైలో ఇది ‘నాటౌట్’గా స్పష్టమైంది. అప్పటికీ ఆసీస్ చేతిలో ‘రివ్యూ’ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ వినియోగించుకోక పోవడం విస్మయానికి గురి చేసింది. నిజానికి షాన్ మార్ష్ అవుట్ ప్రకటించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా..?
మరో ఎండ్ లో ఉన్న కెప్టెన్ స్మిత్ దగ్గరకు వచ్చి రివ్యూకు వెళ్దామా లేదా అన్నది సంప్రదింపులు జరుపుతుండగా, స్మిత్ ‘గో’ అని చెప్పగా, పెవిలియన్ కు వెళ్ళిపోమన్నారని మరో మాట ఎత్తకుండా పెవిలియన్ కు వెళ్ళిపోయాడు. అయితే అసలు స్మిత్ చెప్పింది రివ్యూకు ఒకే చెప్తూ ‘గో’ అన్నారని మ్యాచ్ ముగిసిన తర్వాత గానీ తెలిసి రాలేదు. అయితే అప్పటికే ఆస్టేలియా తగిన మూల్యం చెల్లించుకుంది. అయితే ఇదంతా విని నవ్వుకోవడం పాఠకుల వంతవుతోంది.
ఇక, తన రివ్యూ విషయమై మ్యాచ్ ముగిసిన తర్వాత స్పందిస్తూ… తానూ అలా చేసి ఉండాల్సింది కాదని, ఆ సమయంలో అసలేం చేస్తున్నానో కూడా తనకే అర్ధం కాలేదని, కెప్టెన్ గానే కాకుండా ఒక ఆటగాడిగా తానూ అలా వ్యవహరించి ఉండాల్సింది కాదని, అది కావాలని చేసిన తప్పు కాదని, ఆ టైంలో బుర్ర పని చేయలేదని వివరణ ఇచ్చుకున్నాడు. స్మిత్ వ్యవహార శైలిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రిఫరీకి ఫిర్యాదు కూడా చేసాడు.
అలాగే ముందు రోజు నాథన్ లయన్ వేసిన డైలాగ్ కు పంచ్ డైలాగ్ వదిలాడు విరాట్. టీమిండియాలో కోహ్లి పాముకున్న తల లాంటి వాడని, తల కొడితే ఆటోమాటిక్ గా మాకు కావాల్సిన జరిగిపోతుందని స్పిన్నర్ నాథన్ లయన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ… మీరు తల మీద దృష్టి పెట్టండి, కానీ పాము ఎలాగైనా జారుకోగలదు, తలకొట్టినా పాము చావదన్న విషయం నిరూపణ అయ్యింది అంటూ పవర్ ఫుల్ పంచ్ ఇచ్చాడు విరాట్.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…