
స్పిన్ పిచ్ లను రూపొందించమని ఆదేశాలు ఇస్తూ… వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడంటూ విమర్శలు ఎదుర్కొన్న కోహ్లి, తాజా ఆస్ట్రేలియా మ్యాచ్ లకు కూడా అదే రకమైన స్పిన్ పిచ్ లను తయారు చేయించుకుని బొక్కా బోర్లా పడ్డారు. స్పిన్ ఎదుర్కోలేక ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు పెవిలియన్ బాట పడతారని భావిస్తే, అందుకు విరుద్ధంగా టీమిండియా బ్యాట్స్ మెన్లు స్పిన్ మంత్రాన్ని చవిచూడలేక స్వల్ప స్కోర్లకే వెనుదిరుగుతున్నారు. టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కొని స్మిత్ సెంచరీ పూర్తి చేయగా, మరో వైపు జట్టు మొత్తం కలిపి కూడా సెంచరీ పూర్తి చేయడానికి ముప్పతిప్పలు పడుతున్నారు.
ఒక విధంగా చెప్పాలంటే… ప్రతి బంతికి వికెట్ తీసే విధంగా ఆసీస్ స్పిన్నర్లు టీమిండియా బ్యాట్స్ మెన్లకు దడ పుట్టిస్తున్నారు. అందుకే బంతిని ఆడాలో లేదో కూడా తెలియని సందిగ్ధ అవస్థలోకి వెళ్ళిపోయిన కెప్టెన్ విరాట్ కోహ్లి, స్ట్రెయిట్ బంతిని వదిలేసి బౌల్డ్ అయ్యాడు. ఆటలో గెలుపు, ఓటములు సహజమే. ప్రతి మ్యాచ్ లోనూ విజయం సాధించడం ఎవరి తరమూ కాదు. కానీ, అంతర్జాతీయ స్థాయిలో ఉండి, గల్లీ క్రికెటర్ల కంటే దారుణంగా బ్యాటింగ్ చేయడం మాత్రం అత్యంత శోచనీయమైన విషయం. ఆసీస్ స్పిన్నర్లు బాల్ పట్టుకుంటే మన బ్యాట్స్ మెన్లు బ్యాట్ పట్టుకోవడానికి వణికిపోతున్నారు.
ఓటమిని సహించలేని విరాట్ కోహ్లికి ఆసీస్ బృందం గట్టి షాకే ఇచ్చినట్లుగా కనపడుతోంది. ఫీల్డింగ్ లో ఎంతో నిరాశతో ఉన్నట్లుగా హావభావాలు పలికించిన కోహ్లి, బ్యాటింగ్ చేసే సమయంలోనూ నైరాశ్యత ప్రదర్శించారు. దీంతో జట్టుతో పాటు కెప్టెన్ గా తానూ ఎంత ఒత్తిడిలో ఉన్నాడో చెప్పకనే చెప్పాడు విరాట్. మొదటి టెస్ట్ ను చేజార్చుకున్న టీమిండియా, సిరీస్ లో తదుపరి మ్యాచ్ లలో అయినా ఆశించిన మేరకు పోరాటపటిమను ప్రదర్శిస్తుందో లేదో చూడాలి.
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…
Rinku Singh has once again missed out on India’s T20I squad, and former India batter…