Telugu

గ్యాప్ ఇచ్చినా… తీసుకున్నా… మంచిదే..!

టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఎదురైన పరాభవం క్రికెట్ ప్రేమికులనే కాక, విరాట్ కోహ్లి అభిమానులను ప్రత్యేకంగా నిరాశ పరిచింది. కెప్టెన్ గా భారత్ కు ఎన్నో అనూహ్యమైన విజయాలను అందించిన విరాట్ నేతృత్వంలో మరొకసారి టీమిండియా టీ20 ప్రపంచ కప్ ను కైవసం చేసుకోవాలని అంతా భావించారు. అయితే కీలకమైన మొదటి మ్యాచ్ లలోనే చేతులెత్తయడంతో టీమిండియా తిరుగుముఖం తప్పని పరిస్థితి అనివార్యం అయిన విషయం అందరికీ విదితమే.

ఇదిలా ఉంటే కెప్టెన్ గా బాధ్యతల నుండి తప్పుకున్నా టీ 20లలో ఒక ఆటగాడిగా ఖచ్చితంగా కొనసాగుతాను, జట్టుకు తాను అండగా ఉంటానని చెప్పిన విరాట్ కోహ్లి, ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభం కాబోయే న్యూజిల్యాండ్ టీ20 సిరీస్ కు దూరం కావడం విరాట్ అభిమానులకు నిరాశ కలిగించే అంశమే. అయితే కెప్టెన్ గా కన్నా, ఒక ఆటగాడిగా గత కొన్నాళ్లుగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న విరాట్ కు ఈ బ్రేక్ ఆహ్వానించదగ్గదే.

ADVERTISEMENT

‘సెంచరీ’ అంటే తృణప్రాయంగా చేసే విరాట్ కు గత కొన్నాళ్ళుగా ‘సెంచరీ’ అన్న మాటే లేకుండా పోవడం టీమిండియా వైఫల్యాలలో ప్రధానమైన అంశం. ఓ పక్కన కెప్టెన్ గా బాధ్యతల నుండి తప్పుకోవడం, అదే సమయంలో టీ20 సిరీస్ లో విరాట్ కనిపించకపోవడం అనేది క్రికెట్ ప్రేమికులకు రుచించని అంశమే అయినా… విరామం లేకుండా కొనసాగుతున్న కెరీర్ లో విరాట్ కు మాత్రం ఈ గ్యాప్ తాను తీసుకున్నా… బీసీసీఐ ఇచ్చినా శుభ పరిణామమే! సింహం రెండు అడుగులు వెనక్కి వేసిందంటే… జూలు విదిల్చదానికే అన్న హెచ్చరిక కూడా ప్రత్యర్థి జట్లు గుర్తుంచుకోవాలి మరి!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Varanasi: One Story, Seven Films Worth of Experiences

SS Rajamouli has an ambitious vision for Varanasi. The filmmaker described Varanasi as seven films…

20 minutes ago

Dil Raju’s Ranbir Moment Takes an Awkward Turn

Dil Raju praised Ranbir Kapoor at the Ramayana event, calling him one of the best…

50 minutes ago