
రెండవ ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లను కేవలం 130 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా, విజయానికి 207 పరుగులు చేయాల్సి ఉంది. భారీ బ్యాటింగ్ లైనప్ కలిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లను పెవిలియన్ కు పంపడంలో ఫాస్ట్ బౌలర్లు అందరూ తలో చేయి వేసారు. భువనేశ్వర్ కుమార్ 2, బూమ్రా 3, షమీ 3, పాండ్య 2 వికెట్లతో సత్తా చాటడంతో, కేవలం 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే తొలి ఇన్నింగ్స్ లీడ్ తో కలిపి 208 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది.
భారీ బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియాకు 208 పరుగుల లక్ష్యం పెద్దది కాకపోయినా, పిచ్ స్వభావం, సఫారీ బౌలర్ల కలయిక టీమిండియా బ్యాట్స్ మెన్లకు చుక్కలు కనిపించాయి. ఓపెనింగ్ జోడి 30 పరుగులు జోడించిన తర్వాత ధావన్ 16 అవుట్ కాగా, ఆ వెనువెంటనే మురళీ విజయ్ 13, పుజారా 4 పరుగులకు అవుట్ కావడంతో, కష్టాల్లో పడింది. ఈ తరుణంలో విరాట్ కోహ్లి – రోహిత్ శర్మలు కలిసి నింపాదిగా ఆడుతూ స్కోర్ ను ముందుకు కదిల్చారు. అయితే 71 పరుగుల టీమిండియా స్కోర్ బోర్డు వద్ద ఫిలిందర్ బౌలింగ్ లో విరాట్ కోహ్లి (28) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో, వెంటనే రోహిత్ శర్మ (10), పాండ్య (8) ఔటయ్యారు.
క్రీజులో అశ్విన్ – సాహాలు ఉన్నప్పటికీ, బాల్ కు, బ్యాట్ కు సంబంధం లేకుండా షాట్ల తీరు ఉండడం, ఇక మ్యాచ్ పై టీమిండియా అభిమానులు ఆశలు వదులుకోవచ్చు అనే సంకేతాలను ఇస్తోంది. ఇక్కడ నుండి ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవడం అనేది జరిగితే, ఒక అద్భుతంగానే పరిగణించవచ్చు. దీంతో మొదటి టెస్ట్ మ్యాచ్ ను మానసికంగా సఫారీ ఖాతాలో వేసేసుకున్నారు టీమిండియా అభిమానులు. అయతే కనీసం పోరాటపటిమను ప్రదర్శిస్తారో లేదో అన్నది చూడాలి.
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…
Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…