Telugu

4-0తో చరిత్ర సృష్టించిన టీమిండియా!

అవును… టీమిండియా సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. అసాధ్యం అనుకున్న విషయాలన్నీ సుసాధ్యం చేసి చూపిస్తోంది. బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ పైన ఒకే రోజు 10 వికెట్లు నేలకూల్చడమంటే చాలా కష్టమన్న క్రీడా పండితుల అంచనాలను తప్పని నిరూపించే విధంగా… ఇంకా 7 ఓవర్ల సమయం ఉండగానే మ్యాచ్ ను విజయవంతంగా ముగించగలిగింది. 4 రోజుల ఒక సెషన్ వ్యవధిలో 17 వికెట్లు పడిన తరుణంలో… చివరి రెండు సెషన్లలో ఏకంగా 10 వికెట్లను తీసి, గతంలో ఎదురైనా పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నారు.

చివరి రోజు 12 పరుగుల తేడాతో మ్యాచ్ ను ప్రారంభించిన ఇంగ్లాండ్ లంచ్ విరామం సమయానికి కనీసం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా నింపాదిగా ఆడుతూ స్కోర్ బోర్డును 97 పరుగులకు చేర్చారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని భావిస్తున్న తరుణంలో… రవీంద్ర జడేజా మ్యాచ్ ను మలుపు తిప్పాడు. మరొకసారి కుక్ వికెట్ ను తన ఖాతాలో వేసుకుని 103 పరుగుల వద్ద వికెట్ల పతనాన్ని ప్రారంభించిన జడేజా, 207 పరుగుల వద్ద చివరి వికెట్ ను కూడా తీసి టీమిండియా ఘనవిజయానికి కారణమయ్యాడు. మొత్తంగా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ముందు తొడగొట్టాడు.

ADVERTISEMENT

దీంతో డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్ కాస్త భారత్ వైపుకు తిరగడంతో సిరీస్ ను 4-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. మ్యాచ్ ను మలుపు తిప్పిన జడేజాకు ఓ ప్రత్యేక అవార్డును బహుకరించగా, ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, సిరీస్ ఆద్యంతం తన బ్యాటింగ్ తో మంత్రముగ్ధులను చేసిన విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. టీమిండియా సాధించిన ఈ విజయంతో ప్రతి క్రికెట్ అభిమాని ఉత్సాహంతో ఉప్పొంగుతున్నాడు.

Inline image 1

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jagan Locked Period, But Who Will Back Him?

The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…

22 minutes ago

కేసీఆర్‌కి చెప్తే వినలేదు… మీరైనా వింటారా రేవంత్?

తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…

52 minutes ago