
ఈ వార్తలు దావాలనంగా వ్యాపించాకా మొత్తానికి నిర్మాతలు దీని మీద క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఆగిపోలేదని ఇప్పటికే రెండు ముఖ్యమైన షెడ్యూల్స్ పూర్తి అయ్యాయని, త్వరలోనే మరో భారీ షెడ్యూల్ ను మొదలు పెట్టనున్నామని లైకాకు సంబంధించిన ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. అదే సమయంలో తరువాతి జరగబోతున్న షెడ్యూల్ కు సెట్ వర్కు కూడా జరుగుతుందని తెలిపారు. నిజానికి ఈ సినిమా దిల్ రాజుతో మొదట ఈ సీక్వెల్ ను ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
మొదట్లోనే శంకర్ వరస ఏంటో అర్ధమయ్యి దిల్ రాజు అంత రిస్క్ చేయాలనీ అనుకోలేదు. దిల్ రాజు తప్పుకున్న తరువాత లైకా వారు ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కాజల్ కు కమల్ తో ఇదే మొదటి సినిమా. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే రాజకీయాలలోకి వచ్చిన కమల్ హస్సన్ ఇదే తన చివరి సినిమా అని ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఈ సినిమాకు ఏం జరగబోతుందో చూడాలి.
BOTTOM LINE Packed with Youth Connect RATING 2.75/5 Story, Screenplay, Direction: Savin SA Cast: Vinayak…
Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…