
‘యాన్ ఎకానమీ ఆఫ్ 99 పర్సెంట్’ పేరిట ఓ నివేదికను విడుదల చేస్తూ, గడచిన రెండేళ్లలో ఇండియాలోని ధనికులు మరింతగా ధనవంతులైతే, పేదలు మరింత పేదలుగా మారారని వెల్లడించింది. ఇండియాలో 84 మంది బిలియనీర్లు (ఆస్తి విలువ కనీసం 6,750 కోట్లకు పైగా) ఉండగా, వారి వద్ద 248 బిలియన్ డాలర్ల (సుమారు 16.74 లక్షల కోట్లు) ఆస్తులున్నాయని తెలియజేసింది. భారత మొత్తం సంపద 3.1 ట్రిలియన్ డాలర్లని తెలిపింది.
వచ్చే 20 సంవత్సరాల్లో 500 మంది వద్ద 2.1 ట్రిలియన్ డాలర్ల సంపద చేరుతుందని భావిస్తున్నామని, అప్పటికి దేశ జనాభా 130 కోట్లను దాటుతుందని ఆక్స్ ఫామ్ తన నివేదికలో అంచనా వేసింది. అట్టడుగు నుంచి ఉన్న ప్రజల్లో 10 శాతం మంది తమ సంపదలో దాదాపు 15 శాతాన్ని కోల్పోయారని, మహిళలకు వేతనాలు ఇవ్వడంలోనూ, దినసరి కూలీల చెల్లింపులోను తీవ్ర అన్యాయం జరుగుతోందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన వారికి సరైన ఫలితం దక్కడం లేదని చెప్పింది.
నేడు రాష్ట్రమంతటా జరుగుతున్న పోలింగ్ ఒక ఎత్తు అయితే పులివెందుల పోలింగ్ ఒక్కటీ మరో ఎత్తు అన్నట్లు సాగుతోంది. ఎక్కడికక్కడ…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి “చొక్కా మడత పెడతా.. పులివెందులలో ఓటు వేస్తా... ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి చూస్తానంటూ..” రెండు…