
మహ్మద్ బషీర్ 37 ఏళ్లుగా దుబాయ్ లో పనిచేస్తున్నాడు. రంజాన్ పండగ సందర్భంగా ఇటీవలే ఆయన కేరళకు వచ్చి గత బుధవారం తిరిగి బయలుదేరి వెళ్లారు. ఆయన ఎక్కిన ఎమిరేట్స్ విమానం దుబాయ్ ఎయిర్ పోర్టులో క్రాష్ ల్యాండ్ అవడంతో మంటలు చెలరేగి, ప్రయాణికులందరూ బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బతికి బయటపడ్డారు. అందులో మహ్మద్ బషీర్ కూడా ఒకరు.
ఇక, లాటరీ టికెట్ విషయానికొస్తే.. స్వదేశం వచ్చి తిరిగి వెళుతున్న ప్రతి సారి లాటరీ టికెట్ కొనడం ఖాదిర్ కు అలవాటు. అదే మాదిరిగా ఈ సారి కూడా ఆయన దుబాయ్ ఎయిర్ పోర్టులోని దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనియర్ వద్ద ఒక టికెట్ కొనుగోలు చేశాడు. ఆ లాటరీ బుధవారం నాడు తీయగా, ఆయన కొన్న టికెట్ కు కోట్ల రూపాయలు వచ్చాయి.
ఈ సందర్భంగా మహ్మద్ బషీర్ మాట్లాడుతూ… విమాన ప్రమాదం జరిగిన సమయంలో తనకు మరో అవకాశమివ్వమని దేవుడిని ప్రార్థించానన్నారు. ఈ లాటరీ తగలడం తనకు చాలా ఆనందంగా ఉందని, ఈ డబ్బును సహాయ కార్యక్రమాలకు వినియోగిస్తానని చెప్పారు. పక్షవాతంతో బాధపడుతున్న కుమారుడు, పెళ్లికి ఎదిగిన ఒక కుమార్తె తనకు ఉన్నారని, వారి కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తానని చెప్పారు.
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…