Telugu

మత మార్పిడులను ప్రోత్సహించని మతం హిందూ మతం

భారత్‌లోనే ఒక రాష్ట్రం వాళ్ళు మరో రాష్ట్రంలో ఉద్యోగం, వ్యాపారాల రీత్యా స్థిరపడితే పరాయి దేశస్థుడన్నట్లు చూస్తుంటారు. తమ ఉద్యోగాలు, వ్యాపారాలు, భూములు ఆక్రమించుకుంటున్నారని వితండవాదం చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల ప్రజల వలన తమ భాష, సంస్కృతికి భంగం కలుగుతోందని వాదించేవారు కూడా ఉన్నారు.

భారత్‌లోనే ఈ పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు అమెరికన్లు లేదా ఆస్ట్రేలియన్లు లేదా మరో దేశస్తులు భారతీయులని చూసి అభ్రతభావానికి లోనవరా?అంటే తప్పకుండా అవుతారు.

ADVERTISEMENT

భారతీయులు తెలివైనవారు, కష్టపడి పని చేస్తారు. నెమ్మదస్తులు, అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోరనే మంచి పేరుంది. ఇది ముందుతరం ఎన్ఆర్ఐలు తమ మంచి నడవడికతో సంపాదించి పెట్టిన మంచి పేరు.

కానీ అమెరికాలో కొత్త తరం ఆలోచనలు, మాట తీరు, నడవడిక అన్నీ వారికి చాలా భిన్నంగా ఉంటాయి. హంగు, ఆర్భాటం ప్రదర్శనకు మొగ్గు చూపుతారు. విదేశంలో ఉన్నామనే సంగతి మరిచినట్లు బహిరంగ ప్రదేశాలలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు.

మరీ ముఖ్యంగా కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు, సినీ, రాజకీయ నాయకులు అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు చాలా అతి చేస్తుంటారు. కొందరు చేసే ఈ అతి లేదా అత్యుత్సాహం అందరికీ ఇబ్బందులు సృష్టిస్తుంది. అందరికీ చెడ్డ పేరు తెస్తుంది.

ఇలాంటి వ్యవహారశైలితో భారతీయుల పట్ల అమెరికన్లకు చెడు అభిప్రాయం కలుగుతుందని, దాని వలన ఊహించని సమస్యలు ఎదురవుతాయని గ్రహించలేరంటే ఆశ్చర్యం కలుగుతుంది.

అమెరికన్లలో కొంతమంది హిందూమతం, దాని సంస్కృతి, సంప్రదాయాలు, యోగా, ధ్యానం గొప్పదనం తెలుసుకొని హిందూమతంలోకి మారుతుంటారు లేదా వాటి గురించి నేర్చుకొని పాటిస్తుంటారు. సగటు భారతీయుల కంటే అమెరికన్లే యోగా ఎక్కువ చేస్తారనేది వాస్తవం.

కానీ కొందరు చేసే అతి వలన హిందూమతం వలననే తమ దేశానికి, మతానికి, సంస్కృతికి ప్రమాదమని భావించే అమెరికన్లు కూడా ఉన్నారు.

అలాంటి వారే సోషల్ మీడియాలో విమర్శలు, భౌతిక దాడులు చేస్తుంటారు. అటువంటి వారికి అమెరికాలో పుట్టి పెరిగిన ఓ భారతీయ సంతతికి చెందిన యువతి చక్కటి సమాధానం చెప్పింది.

ఇటీవల టెక్సాస్ సిటీ కౌన్సిల్ మీటింగ్‌లో ఆమె మాట్లాడుతూ, “హిందూమతం మత మార్పిడిలను ప్రోత్సహించదు. ఇతర మతాలను కించపరచదు. అమెరికాలో హిందువులు తమ మతాన్ని అనుసరిస్తూనే థాంక్స్ గివింగ్, క్రిస్మస్ పండుగలను అందరితో కలిసి మెలిసి సంతోషంగా జరుపుకుంటారు. కనుక వారిని చూసి ఎవరూ అభ్రతాభావానికి గురవవలసిన అవసరం లేదు. వారు కూడా అమెరికా అభివృద్ధికి కృషి చేస్తున్నారని గ్రహిస్తే చాలు,” అని అన్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ప్రతిపక్షాలకు మాత్రమే: గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత…ఓడితే ప్రభుత్వ దౌర్జన్యం…

స్థానిక ఎన్నికల సమరానికి పార్టీ క్యాడర్, లీడర్ లకు కూటమి ప్రభుత్వం మీద యుద్ధం చెయ్యాల్సిందే అంటూ తేల్చి చెప్పిన…

20 minutes ago

Nani’s The Paradise: Is an A Certificate Waiting?

Nani’s The Paradise is heading towards a September 24 release with a 2 hour 49…

23 minutes ago