Telugu

పాకిస్తాన్ ర్యాంక్ 80… ఇండియా ర్యాంక్ 121..!

సంతోషం అన్నది మనిషి కోర్కెలు, ఆశలు ఇలా ఎన్నో అంశాలను బట్టి ఉంటుంది. కానీ వీటన్నింటినీ పక్కన పెట్టేసి… అసలు ఏ దేశంలో ఆనందం దొరుకుతుందీ తెలుసుకోవాలంటే ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ప్రపంచ సంతోషకర దేశాలు-2017 నివేదిక గురించి తెలుసుకోవాల్సిందే. ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉంటున్న వారి జాబితాలో నార్వే ప్రజలు అగ్ర స్థానంలో ఉన్నారు.

గత మూడేళ్లుగా డెన్మార్క్ ప్రథమ స్థానంలో ఉండగా, 2017 సంవత్సరానికి గానూ ఈ స్థానాన్ని నార్వే కైవసం చేసుకువడంతో, డెన్మార్క్ రెండో స్థానానికి వెళ్లింది. ఆ తర్వాత ఐస్ ల్యాండ్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, నెదర్లాండ్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్ సంతోషం వెల్లివెరిసే టాప్ టెన్ దేశాలుగా ఉన్నాయి. అమెరికా 14వ స్థానంలో ఉండగా, అంతగా సంతోషం లేని దేశాల్లో కింది నుంచి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, బురుండీ, టాంజానియా, సిరియా, ర్వాండా, టోగో, గుయానా, లైబీరియా, సౌత్ సూడాన్, యెమన్ ఉన్నాయి.

ADVERTISEMENT

ఇక మన దేశం సంగతి ఏంటనుకుంటున్నారు…? మన దేశంలో కంటే పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో ప్రజలు ఎక్కువ సంతోషంతో ఉన్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక స్పష్టంగా చెప్తోంది. సంతోషకర దేశాల జాబితాలో మన స్థానం 121 కాగా, చైనా 79, పాకిస్థాన్ 80, నేపాల్ 99, బంగ్లాదేశ్ 110, శ్రీలంక 120వ స్థానాల్లో ఉన్నాయి. అంటే మన దేశ ప్రజలు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

బొత్స జనసేనలో చేరుతున్నారటగా?

మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…

15 minutes ago

Revanth Reddy Blackmailed Cong: Surekha Hits Back!

The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…

22 minutes ago