
క్రికెట్ అనే ఆట అంతర్జాతీయంగా పలుకుబడి రాణించిన కాలం నుండి ఎన్నో అవతారాలు మార్చి నేడు మన ముందు టెస్ట్, వన్-డే, టీ-20 లు గా చలామణిలో ఉన్నాయి. అయితే ఒకప్పుడు ఆడే ఫార్మటు మారినా , దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు మారేవారు కాదు.
కానీ, నేటి మోడరన్ డే క్రికెట్ లో ఫార్మటు ఫార్మటు కు ఆటగాళ్ళను ఫిల్టర్ చేస్తూ ఒక ఆటగాడు కేవలం ఈ ఫార్మటు కు పరిగణించబడుతాడు అని బోర్డు భావిస్తుంది. ఈ పద్ధతిని సరైన రీతిలో ఉపయోగించుకుంటే, అది జట్టుకు చాలా మేలు చేకూరుస్తుంది. కానీ, ప్రస్తుత భారత క్రికెట్ ఈ ఫార్మటు ల మోజులో పడి ఆటగాళ్ల భవిష్యత్ ని సంకటంలో పడేస్తున్నారు.
టెస్ట్ క్రికెట్ లో చూసుకున్నట్టయితే, నితీష్ రెడ్డి కు అవకాశం ఇస్తున్నారు కానీ ఎందుకు ఇస్తున్నారనే స్పష్టత లేదు. బ్యాటింగ్ ఆల్-రౌండర్ గా జట్టులోకి తీసుకుని, 7వ వికెట్ పడ్డాక బ్యాటింగ్ కు పంపుతూ, ఇన్నింగ్స్ మొత్తానికి 4-6 ఓవర్లు బౌలింగ్ అవకాశం ఇప్పిస్తూ అటు బ్యాటర్ గాను కాక, ఇటు బౌలర్ గానూ లేక ఆయన కెరియర్ ని నడిమధ్యలో నిలబెట్టారు.
ఇటు చూస్తే, వాషింగ్టన్ సుందర్ ఒక బౌలింగ్ ఆల్-రౌండర్. కానీ, ఒక మ్యాచ్ లో అతన్ని 1 డౌన్ లో పంపి, ఆ తరువాతి మ్యాచ్ లో మరలా 6 డౌన్ లో అవకాశం ఇచ్చారు. బౌలింగ్ లో చూసుకున్న అతనికి పెద్ద అవకాశమేమి రావడంలేదు. నాచురల్ గా బౌలింగ్ ఆల్-రౌండర్ గా ఉన్న అతనిని బ్యాటింగ్ ఆల్-రౌండర్ చేయాలనుకునే ఆలోచనతో మొత్తానికి అతని కెరీర్ తోనే ఆటలాడుతున్నారు జట్టు యాజమాన్యం.
ఇక అక్షర్ పటేల్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే కోచింగ్ స్టాఫ్ కు అంత మంచిది. గత 3-4 ఏళ్లగా నిలకడగా తానేంటో నిరూపించుకుంటూనే వస్తున్నాడు అక్షర్ పటేల్. ఇతడిని కూడా ఒక మ్యాచ్ ఆడిస్తారు, తరువాతి మ్యాచ్ లో తీసేస్తారు, ఇలా ఎందుకు అనే ప్రశ్న కు సమాధానముండదు.
పైన చర్చినవారిని కనీసం జట్టులోకి తీసుకుని తరువాత తొలగించారు. రింకు సింగ్ మరియు మొహమ్మద్ షమీ లను సెలెక్టర్లు ఎందుకు లైట్ తీసుకుంటున్నారో కూడా అర్ధం కాలేదు. 2024 టీ-20 వరల్డ్ కప్ లో కాంబినేషన్ కుదరక రింకు ను తప్పిస్తే, మళ్ళీ అప్పటినుండి మొన్న జరిగిన ఆసియా కప్ ఫైనల్ వరుకు రింకు జట్టులోకి అడుగు పెట్టలేదు.
షమీ విషయానికి వస్తే, ఇక అతన్ని సెలెక్టర్లు పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. 2023 వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ కు వెళ్లటంలో కీలక పాత్ర పోషించిన షమీ కి అప్పటినుండి ఇప్పటి దాకా మళ్ళీ జట్టులో సరైన అవకాశం రాకపోవటం సగటు భారత అభిమానిని బాధింపజేస్తుంది.
ఇటు బౌలింగ్ చూస్కుంటే సిరాజ్ కు కారణం లేకపోయినా రెస్ట్ ఎందుకు ఇస్తారో తెలియదు. హర్షిత్ రానా చూపే యావరేజ్ ఆటకు 3 ఫార్మట్స్ లో అవకాశం ఎందుకో అర్ధం కాదు, జట్టులో ఎన్ని సార్లు అవకాశమిచ్చినా, ప్రతిసారి దుర్వినియోగం చేసుకునే ప్రసిద్ ను మళ్ళీ ఎందుకు ఎంపిక చేస్తారో ఊహకి అందదు. ఇలా, దేశానికి ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లకు వారు జట్టులో ఉంటారనే ధీమా లేకపోతే, చూసే అభిమానులకు మనం గెలుస్తామనే ధీమా ఏముంటుంది..?
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…