స్విస్ లో ఏపీ బస్సు చక్కర్లు!

స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో రేపటి నుంచి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు జరగనున్నాయి. ఈ సదస్సులకు హాజరయ్యే నిమిత్తం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన ప్రతినిధి బృందంతో కలసి నేడు దావోస్ పర్యటనకు బయలుదేరనున్నారు. అయితే ప్రత్యేకంగా తయారు చేయించిన ఓ బస్సు గత వారం రోజుల నుంచి దావోస్ వీధుల్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, అక్కడి ప్రజలతో పాటు పారిశ్రామికవేత్తలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

‘మేక్ ఏపీ యువర్ బిజినెస్’ పేరిట సరికొత్తగా రూపొందించిన ఈ బస్సు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినదే. ఏపీకి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఏపీ సర్కారు ఈ సరికొత్త యత్నానికి శ్రీకారం చుట్టింది. ఇక ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన హోర్డింగులు కూడా అక్కడి వారిని ఆకట్టుకుంటున్నాయి.

Share
Published by

Recent Posts

AP Parishad Polls Record 70.72% Turnout, Visakhapatnam Tops

Andhra Pradesh recorded 70.72 per cent voter turnout in the MPTC and ZPTC elections held…

32 minutes ago

రాధకు మెజార్టీ తగ్గినా.. రావుకు ఓట్లు పెరిగినా జరిగేదదే!

ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల్లో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) విజయవాడ మేయర్…

1 hour ago