రాధకు మెజార్టీ తగ్గినా.. రావుకు ఓట్లు పెరిగినా జరిగేదదే!

ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల్లో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) విజయవాడ మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం కూడా ఒకటి. ఆయన కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో బరిలోకి దిగినప్పటికీ, కూటమి ఓట్లు చీల్చేందుకు ఎవరో వదిలిన బాణమనే అనుమానాలు, అపోహలు కొనసాగాయి. దీంతో కూటమి మద్దతుదారులు, ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ఏబీవీ విషయంలో వాదోపవాదాలకు దిగారు.

అయితే కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వంగవీటి రాధాకృష్ణ ఆశించిన దానికంటే భారీ మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు ఏబీవీ కూటమి ఓట్లను చీల్చలేకపోగా, కేవలం 12,642 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయారు. కనుక ఒకవేళ ఆయనను బాణంగా సంధించినవారు ఎవరైనా ఉంటే తీవ్ర నిరాశకు గురై ఉంటారు. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక తేలు కుట్టిన దొంగలా మౌనంగా ఉండిపోవాల్సిందే.

ADVERTISEMENT

కానీ ఒకవేళ రాధాకృష్ణ బొటాబొటి మెజార్టీతో గెలిచినా, లేదా ఏబీవీ కనీసం 50-60 వేల ఓట్లు సాధించినా ఈపాటికి సోషల్ మీడియాలో దుష్ప్రచారం హోరెత్తిపోయి ఉండేది. ముఖ్యంగా కమ్మ-కాపు సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టి, కూటమి నుంచి జనసేనను బయటకు రప్పించాలని ప్రయత్నిస్తున్నవారు రెచ్చిపోయి ఉండేవారు.

రాధాకృష్ణను కూటమి మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ నేతలే ఆయనకు మెజార్టీ రాకుండా ఏబీవీకి ఓట్లు వేశారనో, లేదా నగరంలోని కమ్మ సామాజిక వర్గం వారంతా కాపు సామాజిక వర్గానికి చెందిన రాధాకృష్ణను కాదని ఏబీవీకి మద్దతు పలికారనో దుష్ప్రచారం మొదలైపోయి ఉండేది.

ఈ పరిణామాలను టీడీపీ నేతలు ముందుగానే ఊహించినట్లున్నారు. అందుకే రాధాకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని, ఆయనకు భారీ మెజార్టీ దక్కేలా కృషి చేశారు. ఇక ఏబీవీకి వచ్చిన ఓట్లలో వామపక్షాల సంప్రదాయ ఓటు బ్యాంకు ప్రభావం ఎంత ఉందనేది చర్చనీయాంశమే. అయితే ఆయనకు వచ్చిన ఓట్లను కమ్మ సామాజిక వర్గానికి ఆపాదించడం మాత్రం సరైనది కాదు.

మొత్తానికి ఏబీవీ ఎపిసోడ్ ‘ఆపరేషన్ సక్సెస్.. బట్ పేషెంట్ ఈజ్ డెడ్’ అన్న చందంగా ముగిసింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ramayana: Why Sai Pallavi Sacred, Kajal-Rakul Bold?

Nitesh Tiwari’s Ramayana is finally out now in theatres. Despite not hitting a big number…

18 minutes ago

Air Suvidha Form: Mandatory Step for NRIs

All international travelers arriving to India now have to complete the Air Suvidha form. This…

38 minutes ago