
అయితే ఐపీఎల్ లో గత విజేతలను పరిశీలించిన వారంతా ఈ సంవత్సరం ముంబైకి ట్రోఫీ అందే అవకాశాలపై పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే గత ఆరు సీజన్లలో గ్రూప్ దశలో టాప్ లో ఉన్న ఏ జట్టు కూడా ట్రోఫీని అందుకోలేదు కాబట్టి! ఐపీఎల్ విజేతలను పరిశీలిస్తే, 2011లో జరిగిన ఫైనల్ లో బెంగళూరు (1), చెన్నై (2) జట్లు తలపడగా చెన్నై గెలిచింది. 2012లో కోల్ కతా (2), చెన్నై (4) జట్లు తలపడగా కోల్ కతా ట్రోఫీని సొంతం చేసుకుంది. అలాగే 2013లో చెన్నై (1), ముంబై (2) ఫైనల్ కు చేరగా ముంబై తొలిసారిగా ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
ఇక 2014 విషయానికి వస్తే పంజాబ్ (1), కోల్ కతా (2) ఫైనల్ లో ఆడగా, కోల్ కతా వశం చేసుకుంది. 2015లో చెన్నై (1), ముంబై (2) ఆడగా మరోసారి తలపడగా, మళ్ళీ విజయం ముంబైనే వరించింది. 2016లో బెంగళూరు (2), హైదరాబాద్ (3) ఫైనల్ ఆడగా హైదరాబాద్ గెలిచింది. ఈ పోటీల్లో టాప్ లో నిలిచిన జట్టు ఏ సంవత్సరం కూడా ట్రోఫీని అందుకోలేదు. దీన్నే ఉదాహరణగా చూపుతున్న విశ్లేషకులు, ముంబై గెలిస్తే చరిత్ర మారినట్టేనని విశ్లేషిస్తున్నారు.
The IT sector has been one of the biggest contributor for the Indian economy over…
Keerthy Suresh has been experimenting with different subjects and genres on the big screen, but…