
నిజానికి ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైనప్పటికీ ముంబై అభిమానులు ఏ మాత్రం కూడా చింతించని పరిస్థితి ఏర్పడింది. ఒకటి, ఓడినా, గెలిచినా ముంబైకు అయ్యే డ్యామేజ్ ఏమీ లేదు. మరొకటి, 230 భారీ లక్ష్యాన్ని చేతులెత్తయకుండా, చక్కని పోరాటపటిమను ప్రదర్శించి 223 పరుగులను నమోదు చేయగలిగారు. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 40 ఓవర్లలో ఏకంగా 453 పరుగులు నమోదు కావడంతో క్రికెట్ అభిమానులకు పండగ వాతావరణం నెలకొంది.
తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ జట్టు ఆది నుండి దూకుడుగా ఆడడంతో తొలి 8 ఓవర్లలోనే 100 పరుగుల స్కోర్ దాటగలిగింది. గుప్తిల్ 18 బంతుల్లో 36, మాక్స్ వెల్ 21 బంతుల్లో 47, మార్ష్ 16 బంతుల్లో 25 పరుగులు చేసి అవుట్ కాగా, అక్సర్ పటేల్ 19 పరుగులతో మరియు ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 55 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 93 పరుగులతో సత్తా చాటారు. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్ మెన్ ప్రతిభ చూపడంతో ఏకంగా 230 పరుగులను నమోదు చేసి, ఈ సీజన్ లో భారీ స్కోర్ ను సాధించిన జట్టుగా పంజాబ్ నిలిచింది.
ఇక, లక్ష్య చేధనను ఘనంగా ఆరంభించింది ముంబై ఇండియన్స్. ఓపెనర్లు సిమ్మన్స్ 32 బంతుల్లో 59, పార్థివ్ పటేల్ 23 బంతుల్లో 38 పరుగులతో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. 99 పరుగుల వద్ద తొలి వికెట్ గా పార్థివ్ వెనుదిరిగిన తర్వాత రానా, రోహిత్ శర్మలు పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన ఇచ్చారు. ఈ తరుణంలోనే మ్యాచ్ ముంబై ఇండియన్స్ చేయి జారిపోయినట్లుగా స్పష్టమైంది. అయితే ఆ తర్వాత హార్దిక్ పాండ్య 13 బంతుల్లో 30, కరణ్ శర్మ 6 బంతుల్లో 19 పరుగులు జోడించగా, మరో ఎండ్ లో ఉన్న పొల్లార్డ్ కూడా 24 బంతుల్లో 50 పరుగులతో సత్తా చాటాడు.
Following the failure of Kara, Dhanush is currently starring as the lead in Om directed…
#Romanchakam Review: Thin Story, Patchy Laughs Romanchakam has a wafer-thin story and relies heavily on…