Telugu

ఒకరు దారి తప్పారు..మరొకరు గాడిన పడ్డారు..!

ఐపీఎల్ లీగ్ లో అత్యంత సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీలు ఏంటా అని అడగగా, అందరి నోటా వచ్చే మొదటి మాట ‘అయితే ముంబై ఇండియన్స్.. లేదా చెన్నై సూపర్ కింగ్స్..!’ ఆ స్థాయి లో ఐపీఎల్ ను ఈ రెండు ఫ్రాంచైజీలు డామినేట్ చేశాయి.

ముగిసిన గత 17 సీజన్లలో ఈ రెండు ఫ్రాంచైజీలు కలిసి ఏకంగా 10 ట్రోఫీలను ఎగరేసుకుపోయారు అంటే అక్కడే అర్ధమవుతుంది ఐపీఎల్ లో వీరి డామినేషన్ ఏ స్థాయిలో ఉందనేది.

ADVERTISEMENT

గడిచిన 17 సీజన్లలో చెన్నై జట్టు ప్లే-ఆఫ్స్ కు కేవలం 3 సార్లు మాత్రమే అర్హత సాధించలేకపోయింది. ఈ సీజన్ తో ఆ సంఖ్య ను 4 కి చేర్చుకుంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ తో విజయాల ఖాతా తెరిచిన చెన్నై జట్టు, సీజన్ ముందుకెళ్తున్న కొద్ది ఇది చెన్నై సూపర్ కింగ్స్ జట్టేనా..? అనేటట్లు ప్రదర్శన కనపరిచి చెన్నై అభిమానులకు ఊహించని షాక్ లు ఇచ్చారు.

ఈ సీజన్లో ఈ జట్టు 10 మ్యాచ్లు ఆడితే కేవలం 2 మ్యాచ్లలోనే వీరు జయకేతనాన్ని ఎగరవేయగలిగారు. ముంబై మరియు లక్నో జట్ల పై గెలిచిన చెన్నై, మిగతా 8 మ్యాచ్లలో ఓటమి పాలయి CSK చరిత్ర లోనే అత్యంత చెత్త సీజన్ గా 2025 ను రూపుదిద్దుకున్నారు.

మరో పక్క, ముంబై జట్టు కూడా మొదటిలో బాగా తడపడినప్పటికీ, ఆ జట్టు ముఖ్య ఆటగాళ్లందరూ సరియైన సమయానికి ఫామ్ లోకి రావడంతో జట్టుకు ఏకంగా 6 వరుస విజయాలను అందించారు.

ముంబై జట్టు తొలి 5 మ్యాచ్లలో కేవలం ఒక్క మ్యాచ్ లోనే గెలిచి, ఈ సీజన్ కూడా పేలవమైన ప్రదర్శనతో ఇంటి దారి పట్టనున్నారు అని నిశ్చాయించుకునే లోపే, జట్టు సమిష్టి కృషితో కేవలం 10 రోజుల వ్యవధిలో పాయింట్ల పట్టిక లో 8 వ స్థానం నుండి టేబుల్ టాపర్స్ గా అవతారమెత్తారు.

అసాధారణ ఆటతీరు తో తలపడిన ప్రతి టీం మీదా పై చేయి సాధిస్తు దారి తప్పిపోయిందా అనుకున్న స్థాయి నుండి గాడిన పడి తన మునుపటి ఫామ్ ను కనపరుస్తూ ముందుకెళ్తుంది ముంబై జట్టు.

మరి ఒకప్పుడు బెస్ట్ రైవల్స్ గా పేరున్న ముంబై, చెన్నై జట్లు ఇలా రెండు భిన్నమైన ఆటతీరు లతో అభిమానులను ఆశ్చర్య పరుస్తున్నారు. ఇప్పటికే, ప్లే-ఆఫ్స్ కు అర్హత ను కోల్పోయాయి చెన్నై మరియు రాజస్థాన్ జట్లు ఐపీఎల్ దారి తప్పిపోయాయి.

అలాగే హైదరాబాద్ జట్టు సైతం ఈ సీజన్ లో 300 కొట్టి తీరుతామని ప్రగల్భాలు పలికి చివరికి ఆడిన 3 మ్యాచ్లలో మాత్రమే గెలిచి అభిమానులను ఢీలా పడేసారు. ఈ ప్లే-ఆఫ్స్ నుండి బయటకు వచ్చే గండం నుండి SRH తప్పించుకుంటుందా.? లేక నేడు గుజరాత్ తో జరిగే మ్యాచ్ లో కూడా ఒడి దొరికిపోనుందో చూడాలి మరి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వారి ఆరాటం.. ప్రజాస్వామ్యం కోసమా. ఓటు బ్యాంకు కోసమా?

ఎస్ఐఆర్ పేరుతో దేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఎన్నికల కమీషన్‌ కలిసి నిర్వహిస్తున్నయా?…

4 minutes ago

So Many Rejections, Nani Must Be Cautious!

Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…

32 minutes ago