
నిన్ననే ఐపీఎల్ 18 వ సీజన్ లో జెర్సీ నెంబర్ 18 మరొకసారి తన నైపుణ్యాన్ని, సత్తా ను చాటుకుంది. అయితే గత రెండు రోజుల క్రితం జరిగిన హోమ్ గ్రౌండ్ మ్యాచ్ లో RCB , పంజాబ్ కింగ్స్ చేతులో ఘోరంగా ఓడిపోయింది. మరొక 36 గంటల వ్యవధిలోనే మరలా ఈ ఇరు జట్లు ఒకరికొకరు తలపడ్డారు.
అయితే, ఇంట జరిగిన అవమానానికి పంజాబ్ లో పంజాబ్ పై ఒక ఘనమైన విజయంతో బదులిచ్చారు RCB . టాస్ గెలిచిన బెంగళూరు తొలుత బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ పంజాబ్ బ్యాటర్లు తమ వికెట్లను ఇంత సులువుగా కోల్పోతారని ఎవరు అనుకోలేదు. పంజాబ్ కు మంచి ఆరంభమే వచ్చినప్పటికీ, కెప్టెన్ రజత్ తన కెప్టెన్సీ తో తొలి వికెట్ ను అందుకున్నాడు.
ఈ క్రమంలోనే విరాట్ తన పాత అవతారమెత్తాడు. ఈ మధ్యన ఫీల్డింగ్ లో చాలా ప్రశాంతంగా కనిపిస్తున్న కోహ్లీ ఇవాళ ఫీల్డ్ లో చాలా అగ్రెసివ్ గా కనిపించాడు. కెప్టెన్ అయ్యర్ వికెట్ పడ్డాక, షెఫర్డ్ పైకి ఎగిరి గంతేశాడు. వధేరా ను రన్-అవుట్ చేసాక కూడా ఇలానే అగ్రెసివ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఇలాగే, మ్యాచ్ ముగిసిన అనంతరం కూడా విరాట్ చేసిన సెలెబ్రేషన్ వైరల్ గా మారడంతో వింటేజ్ విరాట్ ను చూస్తున్నాం అంటూ కోహ్లీ అభిమానులు ఈ వీడియోలను షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక, ఫాన్స్ ను మరింత ఖుషి చేసే వార్త, కింగ్ మరొకసారి ఛేజింగ్ లో తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. మొదటి ఓవర్ లో బ్యాటింగ్ కు వచ్చి, చివరి బాల్ వరుకు క్రీజులోనే నిలిచి, జట్టుకు విజయం అనివార్యమయ్యేవరుకు నెమ్మదిగా, తన వికెట్ను కాపాడుతూ బ్యాటింగ్ చేసిన కోహ్లీ ఇక ఆ తరువాత రెచ్చిపోయి బ్యాటింగ్ చేసారు.
ఒకప్పటి కింగ్ లాగ మరలా బ్యాటింగ్ చేస్తున్నాడు కోహ్లీ. ఇప్పటికి ఈ సీజన్లో ఆడిన 3 ఛేజింగ్లలో ఒక్కసారి కూడా తన వికెట్ ను కోల్పోలేదు కోహ్లీ. నిన్నటి 73 పరుగులకు ఈ సీజన్లో రెండవ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు కోహ్లీ. అలాగే ఈ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మం ఆఫ్ ది మ్యాచ్లను సాధించిన ఆటగాళ్ల స్థానాల్లో కోహ్లీ, రోహిత్ తరువాత 4 వ స్థానంలో నిలిచారు.
ఇక ఈ మ్యాచ్లో పరుగులతో అటు ఆరెంజ్ క్యాప్ రేస్ లో 3 వ స్థానానికి ఎగబాకాడు కింగ్ కోహ్లీ. ఇలాగే నిలకడగా ఆడుతూ, జట్టుకు తొలి ట్రోఫీ తెప్పించాలంటూ ఆర్.సి.బి అభిమానులు కోరుకుంటున్నారు.
Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…