
ప్రతి ఏడాది ఐపీఎల్ లో కళ్ళు చెదిరే ధరకు ఎంపికయ్యే ఆటగాళ్లను మనం చూస్తూనే ఉంటాం. కానీ, అలా జట్టు లోకి వచ్చిన ఆటగాళ్లు అందరు రాణిస్తారని ఎవ్వరు ఊహించలేరు. అరుదుగా కమిన్స్, అయ్యర్ వంటి ఆటగాళ్లు తాము తీసుకునే ధరకు తగ్గ పర్ఫామెన్స్ ఇస్తుంటారు.
కానీ, చాలా మంది ఆటగాళ్లు తాము తీసుకునే సాలరీ కు, చూపే ఆటతీరును అస్సలు పొంతన ఉండదు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఆటగాళ్లను మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఈసారి ఈ జాబితాలోకి ఎవ్వరు ఊహించని ఆటగాళ్ల పేర్లు కూడా తోడయ్యాయి.
మొదటిగా, ఈ లిస్ట్ ను లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్, భారత టెస్ట్ వికెట్-కీపర్ ‘రిషబ్ పంత్’ నుండే మొదలుపెట్టాలి. గతేడాది జరిగిన ఆక్షన్ లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. కళ్ళు చెదిరే 27కోట్ల పారితోషకాన్ని అందుకుంటున్నాడు ఈ వికెట్-కీపర్ బ్యాటర్. కానీ, గడిచిన రెండేళ్లలో పంత్ బ్యాట్ నుండి వచ్చిన మంచి ఇన్నింగ్స్ అంటే వేళ్ళపై లెక్కపెట్టే సంఖ్య ఉండటం కూడా కష్టమే.
అలాగే, ఈ ఐపీఎల్ 2026 లో మరొక భారీ అసంతృప్తి అంటే అది సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫామ్. సూర్య బ్యాటింగ్ ఫామ్ గడిచిన 12-15 నెలల నుండి నిలకడగా లేకపోయినా, ఇటీవలే జరిగిన టి-20 వరల్డ్ కప్ ను గెలిచి వస్తున్న హుషారులో సూర్య బ్యాట్ నుండి పరుగులు వస్తాయనే అనుకున్నారు ముంబై అభిమానులు.
కానీ, అభిమానుల ఆశకు చిల్లు పెడుతూ సూర్య ఇటీవలి కాలంలో అతని వరస్ట్ ఐపీఎల్ సీజన్ ను ముగించుకున్నాడు. 14 మ్యాచ్లలో కేవలం 2, హాఫ్ సెంచరీలు కొట్టగా, ఆ రెండు కూడా తక్కువ స్ట్రైక్-రేట్ తో రావటం తో, జట్టు గెలుపుకు ఆ ఫిఫ్టీలు ఏ మాత్రం ఉపయోగ పడకపోవడం గమనార్హం.
అదే జట్టు నుండి అంచనాలకు తగ్గట్టు రాణించని మరెందరో ఆటగాళ్లున్నారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, ట్రెంట్ బోల్ట్ వంటి బడా బడా ఆటగాళ్లు ఘోరంగా విఫలమవటంతో ముంబై జట్టు ఈ సీజన్లో పేలవమైన ప్రదర్శన తో పక్కకు తప్పుకుంది. రోహిత్ మరియు తిలక్ వంటి వారు కూడా అడపా-తడప ఇన్నింగ్స్ తో ఈ సీజన్ కు ఎండ్ కార్డు వేసేసారు.
ఇక, ఆర్.సి.బీ జట్టు నుండి ఏ ఆటగాడు ఈ లిస్ట్ లో ఉండడు అనుకుంటే అది పొరపాటే. 11 కోట్లు పారితోషకం తీసుకుంటున్న ప్రస్తుత ఆర్.సి.బీ జట్టు వికెట్-కీపర్ ఈ సీజన్లో కేవలం 90 పరుగులు మాత్రమే సాధించి, తన కెరీర్ లోనే అత్యంత పేలవమైన సీజన్ ను కొనసాగిస్తున్నాడు. చూడాలి మరి ప్లే-ఆఫ్స్ లో అయినా ఇతడు ఫామ్ అందుకుంటాడా అని..?
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…