Telugu

ఉత్కంఠభరితంగా ఐపీఎల్ పాయింట్స్ టేబుల్!

9వ సీజన్ ఐపీఎల్ హంగామా దాదాపుగా సగం పూర్తయ్యింది. 8 జట్లు పాల్గొంటున్న ఈ సీజన్లో 4 జట్లు మాత్రమే ‘ప్లే ఆఫ్స్’కు క్వాలిఫై అవుతాయి. అయితే ప్రస్తుతం ఉన్న పాయింట్స్ టేబుల్ ను పరిశీలిస్తే… ఆ నాలుగు స్థానాలకు గానూ 5 జట్లు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నాయి. ధోని సారధ్యం వహిస్తున్న పూణే జట్టు, కోహ్లి నేతృత్వంలోని బెంగళూరు టీం, మురళీ విజయ్ పగ్గాలు అందుకున్న పంజాబ్ దాదాపుగా ఇంటి ముఖం పట్టడం ఖాయంగా కనపడుతున్నాయి. ఈ మూడు జట్లు పుంజుకోవాలంటే ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇక, ప్లే ఆఫ్స్ కు అర్హత పొందే జట్ల జాబితాలో గుజరాత్ అన్నింటి కంటే ముందుగా 9 మ్యాచ్ లలో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉంది. మిగిలిన 5 మ్యాచ్ లలో కనీసం రెండు విజయాలు సాధిస్తే గుజరాత్ గట్టేక్కినట్టే. ఈ సీజన్లో అందర్నీ అవాక్కు చేసింది ఢిల్లీ టీం. గత ఐపీఎల్ సీజన్లలో అంతగా ప్రభావం చూపలేని ఢిల్లీ జట్టు, ఈ సారి మాత్రం ఆడిన 7 మ్యాచ్ లలో 5 విజయాలు సాధించి మంచి ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఢిల్లీ ఇంకా 7 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా క్వాలిఫై కావడానికి 3 విజయాలు సరిపోతాయి గనుక ఢిల్లీ కూడా దాదాపుగా ‘ప్లే ఆఫ్స్’కు చేరినట్టే భావించవచ్చు.

ADVERTISEMENT

ఇక, మిగిలిన రెండు స్థానాల కోసం కోల్ కోతా, ముంబై, హైదరాబాద్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మూడు జట్లు కూడా పోటాపోటీగా ఫాంలోకి రావడంతో చివరి నిముషం వరకు ఏ జట్టు వెళ్తుందో చెప్పలేని పరిస్థితి. నిలకడైన ఆట తీరుతో కోల్ కోతా సత్తా చాటుతుండగా, హ్యట్రిక్ విజయాలతో ముంబై మంచి ఊపు మీద ఉంది. ఇక హైదరాబాద్ జట్టు కూడా ఈ సీజన్లో అంచనాలను మించి రాణిస్తుండడంతో ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్వాలిఫైలో ‘నెట్ రన్ రేట్’ కూడా కీలక పాత్ర పోషిస్తుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి సగం పూర్తయ్యే సమయానికి ఐపీఎల్ రసకందాయంలో పడింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

డేట్ల పంచాయితీ కాదు.. కంటెంట్ సరిగ్గా ఇవ్వండి!

త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న విడుదల కానుంది. నాని ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’…

20 minutes ago

శాసనసభకు రానివారు.. వెళ్ళేవారికి మార్గదర్శనం! అవసరమా?

కేసీఆర్‌ శాసనసభకు రాకుండా ఫామ్‌హౌసులో పడుకుంటే ‘అది గోడకున్న తుపాకీ.. ఎప్పుడో అప్పుడు పేలుతుంది,’ అని సమర్ధించుకుంటారు. ప్రధాన ప్రతిపక్షనేత…

26 minutes ago