Telugu

జీవితం ఆల్ ఈజ్ వెల్ … ఎంత నిజం?

ఒకప్పుడు చేతిలో పెద్దగా డబ్బు లేనప్పుడు సమస్యలు, కష్టాలు ఎక్కువగానే ఉన్నా మనుషులు చిన్న చిన్న సంతోషాలతో సంతృప్తిపడుతూ హాయిగా బ్రతికేవారు. ఆరోగ్యంగానే ఉండేవారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత ఉండేది.
కానీ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పుణ్యమని కనీసం ప్యాకేజీలే రూ. 3-4-5 లక్షల వరకు ఉంటున్నాయి. కాస్త ట్యాలెంట్ ఉండి కష్టపడితే ఆ ప్యాకేజీలు ఒకేసారి రెట్టింపు కూడా అవుతున్నాయి.

కనుక చాలా మంది ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపే వాహనం, రెండు మూడు ఏళ్లలోనే పెళ్లి, 4–5 ఏళ్లలోనే ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు. ఆ తర్వాత చాలా మంది ఇండియాలో టూర్స్, ఫారిన్ టూర్స్ కూడా చేసేస్తున్నారు. కనుక ‘ఆల్ ఈజ్ వెల్’ అనిపిస్తుంది.

ADVERTISEMENT

కానీ ఈ స్థాయికి ఎదిగిన తర్వాత సంతోషం బదులు ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆ కారణంగా మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. కనుక ఇలా టూర్స్, వినోదం, షాపింగ్ అంటూ బయట తిరుగుతూ ఆ ఒత్తిళ్లు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒత్తిడి తగ్గుతోందో లేదో తెలియదు కానీ బయట తిరుగుళ్లు, బయట తిళ్లతో ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి.

కనుక ఉద్యోగం, సంపాదన, ఆస్తులు, ఎంజాయ్‌మెంట్ వెనక తీవ్రమైన శ్రమ, ఒత్తిళ్లు ఉన్నాయని స్పష్టమవుతోంది. కనుక వైట్‌కాలర్ జాబ్స్ చేస్తున్నవారిని, వారి విలాసవంతమైన జీవితాన్ని చూసి ఎవరూ అసూయపడాల్సిన అవసరం లేదు.
ఆ స్థాయికి చేరుకోలేకపోతే అదీ ఓ అదృష్టంగానే భావించగలిగితే, ఉన్న సంపాదనతో ప్రశాంతంగా జీవించవచ్చు. కానీ నానాటికీ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెరుగుతున్న ఛార్జీలు వంటివి మనుషులను సామాన్యంగా కూడా బ్రతకనీయకుండా చేస్తున్నాయని చెప్పక తప్పదు. కనుక ఇప్పుడు పెరిగే ధరలు, ఛార్జీలు, ఫీజులకు సరిపడా సంపాదించుకోవడం చాలా అవసరం. ఆ మాత్రం సంపాదించుకుంటున్న వారు కూడా అదృష్టవంతులే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Dhruv Vikram’s DV4 Shoot to Begin in October

A collaboration has been announced as Pen Movies, Sri Neeladri Productions, and RV Studios come…

10 minutes ago

Popular Choreographer Arrested: Sexual Allegations Shock

Popular dancer and choreographer Raju, who became famous through the Telugu dance reality show Dhee,…

50 minutes ago