ఫిలిం ఛాంబర్.. గిల్డ్ ఛాంబర్ గా మారిందనే కామెంట్లో నిజమెంత?

నిన్న జరిగిన ఎగ్జిబిటర్స్ ప్రెస్ మీట్ లో పెద్ది టికెట్ హైక్ నైజాంలో ఉండదు, షేరింగ్ ఇస్తేనే థియేటర్లలో ఆడనిస్తాం వంటి స్టేట్మెంట్స్ ఎక్కువ వైరల్ అయ్యాయి కానీ.. అదే ప్రెస్ మీట్ లో ఎగ్జిబిటర్స్ తరుపున మాట్లాడిన ఓ కీలక సభ్యుడు “ఈ కాన్ఫరెన్స్ హాల్ కింద ఉన్నది తెలుగు ఫిలిం ఛాంబర్ కాదు.. గిల్డ్ ఛాంబర్” అని చెప్పిన విషయం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందులో చాలా మీనింగ్ ఉంది. నిజంగానే ఫిలిం ఛాంబర్.. గిల్డ్ ఛాంబర్ అయిపోయిందా? యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కి తప్ప అక్కడ మాట్లాడే లేదా వాయిస్ రైజ్ చేసే అవకాశం మరొకరికి ఉండడం లేదా? అనేది కాస్త సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం.

ఎందుకంటే.. సరిగ్గా మే 15న దిల్ రాజు స్వయంగా మీడియా ముందుకు వచ్చి “పెద్ది హెల్తీ రిలీజ్ అవుతుంది, అన్నీ ఇష్యూస్ క్లియర్ అయ్యాయి” అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సరిగ్గా పది రోజులకి ముందే మే 23న హుటాహుటిన తెలంగాణ ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టడం, ఛాంబర్ పెద్దలు నోట మాటకి చెబుతున్నారే తప్ప, అఫీషియల్ ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం లేదని వాపోవడం, ఇదంతా జరిగిన గంటలో సురేష్ బాబు సంతకంతో అఫీషియల్ ప్రెస్ స్టేట్మెంట్ రావడం అనేది చాలా నాటకీయంగా కనిపించాయి.

ADVERTISEMENT

అంటే.. ఎగ్జిబిటర్లు ఇలా మీడియా ముందుకు వచ్చి తమ బాధను చెప్పుకొంటే తప్ప రెస్పాండ్ అయ్యే పరిస్థితిలో ఫిలిం ఛాంబర్ లేదా? ఛాంబర్ ను యాక్టివ్ ప్రొడ్యూసర్స్ & గిల్డ్ నిజంగానే కంట్రోల్ చేస్తుందా? మిగతావాళ్ళకి తమ వెర్షన్ చెప్పుకొనే అవకాశం కూడా ఇవ్వడం లేదా? అసలు ఇంటర్నల్ మీటింగ్స్ లో సెటిల్ అవ్వాల్సిన ఇలాంటి ఇష్యూస్ మీడియా ముందుకు వచ్చి లైవ్ ప్రెస్ మీట్స్ లో సెటిల్స్ చేసుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? అల్లు అరవింద్, దిల్ రాజు వంటి సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ ఇచ్చిన ప్రామిస్ ను కూడా ఛాంబర్ ఎందుకు బేఖాతరు చేసింది? ఒక సింపుల్ అఫీషియల్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడానికి ఛాంబర్ కి 10 రోజుల టైమ్ ఎందుకు పట్టింది? ఎగ్జిబిటర్లతో అన్నిసార్లు ఎందుకు అడిగించుకున్నారు? అది డిలే చేయడం వల్ల ఎవరికి లాభం? ఇలా చాలా ప్రశ్నలు తలెత్తాయి.

అయితే.. చిత్రసీమకి ఓ సపోర్ట్ సిస్టంలా ఉండి, ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరికీ వెన్నుదన్నుగా ఉండాల్సిన ఫిలిం ఛాంబర్ ఇలా ఏక పక్షాన నిలిచినట్లుగా వ్యవహరిస్తుండడం అనేది మంచిది కాదు. త్వరగా ఇది గిల్డ్ ఛాంబర్ కాదు.. తెలుగు ఫిలిం ఛాంబర్ అనే స్టేట్మెంట్ ను సురేష్ బాబు & కో తమ వ్యవహారశైలితో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

Sobhita Has A Message: “Grow Wings, And A Spine”

Sobhita Dhulipala has opened up about why she left home for Mumbai at just 16,…

30 minutes ago

తెలంగాణ మరిచిన నీళ్ళు, నిధులు, నియామకాలు ఆంధ్రాలో!!!

వైసీపీ హయంలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితిని చూసి ప్రజలు లోలోన కుమిలిపోతున్న సమయంలోనే కేసీఆర్‌ హయంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే…

52 minutes ago