
ఈ విడాకులకు కారణం ఏమయ్యుంటుంది అనే దాని మీద మీడియాలో ఇప్పటివరకూ ఎన్నో చర్చలు జరిగాయి. అయితే వారికీ, కుటుంబసభ్యులకు తప్ప ఎవరికీ ప్రస్తుతానికి ఆ విషయం తెలీదు. నాగచైతన్య సినిమాల వరకు ఉన్న ఇమేజ్ చూస్తే చాలా కామ్ గోయింగ్… ఎప్పుడూ కూడా వివాదాలు లేవు.
అతనికి గతంలో ఆఫ్ఫైర్లు ఉన్నట్టుగానీ ఇంకోటి గానీ ఎక్కడా వినిపించలేదు. అసలు అటువంటి షేడ్ కూడా నాగచైతన్య లో ఎప్పుడూ కనబడదు. ఇక సమంతకు గతంలో ఒక రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. అది కూడా హానెస్ట్ రిలేషనే తప్ప ఇంకోటి కాదు. నాగచైతన్య తో రిలేషన్ లో కూడా ఆమె హానెస్ట్ గానే కనిపించేది.
మరి వారిద్దరికీ ఇబ్బంది కలిగించే విషయం ఏదన్నా ఉంటే అది ఇద్దరి అంతస్తులు… అలాగే చిత్ర పరిశ్రమలో వారి స్థాయి. అంతస్తులు విషయంలో నాగచైతన్య పైనా ఉంటే కెరీర్ పరంగా సమంతదే పై చెయ్యి. అంతస్తుల తేడా అయితే అసలు పెళ్లి దాకా వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. ఇక కెరీర్ పరంగా ఉన్న హెచ్చు తగ్గుల వల్లే వారి విడాకులు జరిగి ఉండవచ్చని చాలా మంది అభిప్రాయం.
అయితే వారి పరిచయం మొదటి నుండీ ఆ విషయంలో ఎప్పుడూ సమంత దే పై చెయ్యి. అయితే నిత్యం కలిసి ఉండే భార్యాభర్తల మధ్య ఒక్క చిన్న ఇష్యూ రావడం అది పెద్దది కావడం ఎంత సేపు? ఏది ఏమైనా టాలీవుడ్ లో మరో జంట విడాకుల దిశగా అడుగులు వేసింది.
Toxic has been a painful chapter for Yash and his team. But the actor’s response…
New data is showing that H-1B petitions from Indian companies in the US have dropped…