Telugu

క్షణికావేశం ఖరీదు ప్రాణమా.?

నేటి సమాజంలో ఒక మనిషి ప్రాణం విలువ నానాటికి తగ్గుతుందా.? అసలు విలువే లేకుండా పోతుందా.? అన్న సందేహాలు కలుగుతున్నాయి. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని ఒకరు, పరీక్షలో పాస్ కాలేదని మరొకరు, అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, టీచర్ పనిష్మెంట్ ఇచ్చిందని ఇలా చిన్న చిన్న కారణాలకు మనుషులు ఆత్మహత్యలు అనే పెద్ద సాహసాలే చేస్తున్నారు.

ఇక మరికొందరు ప్రేమ పేరుతో తానూ ప్రేమించిన వ్యక్తి తిరిగి తనను ప్రేమించడం లేదని వారి ఆయువును హరిస్తున్నారు. ఇంకొందరు పెద్దరికం పేరుతో పిల్లలు తమకు తనకు నచ్చని వ్యక్తిని ప్రేమిస్తున్నారని, పెళ్లి చేసుకుంటున్నారని పరువు హత్యలకు పాల్పడుతున్నారు.

ADVERTISEMENT

ఇక వివాహేతర సంబంధాలు, అక్రమ బంధాలు ఎంతమంది ఉసురు తీస్తున్నాయో రోజు వార్త పత్రికలలో చూస్తూనే వస్తున్నాం. మద్యం మత్తులో వాహనాలతో రోడ్ల మీదకొచ్చి అభంశుభం తెలియని అమాయకుల పాలిట యమధర్మరాజులుగా మారే మందుబాబుల సంఖ్య నానాటికి పెరుగుతూ పోతుంది.

ఇక వారి కామవాంఛను తీర్చుకోవడానికి మృగాళ్ళుగా చెప్పుకునే వారు రోజుకి సగటున ఎంతమంది ఆడపిల్లల పాలిట మృత్యువుగా మారుతున్నారో బయటపడుతున్న గణాంకాలను పరిశీలిస్తే యిట్టె తెలుస్తుంది. భార్యను భర్త, భర్తను భార్య, పిల్లలను తల్లితండ్రులు, తల్లితండ్రులను పిల్లలు ఇలా చంపుకుంటున్న వార్తలు సమాజంలో పెరుగుతున్న ఘోరాలకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.

ఒక్క వెయ్యి రూపాయల కోసం తమకు జన్మనిచ్చిన తల్లితండ్రులను సైతం పాడెక్కేస్తున్న ఘటనలు సమాజంలో తగ్గుతున్న మానవ సంబంధాలకు అద్దం పడుతున్నాయి. గతంలో కేవలం హంతకులు, దోపిడీ దొంగలు మాత్రమే చేసే ఈ హత్యలు ఇప్పుడు మన పక్కంటిలో కనిపిస్తున్నాయి.

గడపకు గడపకు మధ్య దూరం మాత్రమే అన్నట్టుగా ఈ హత్యలు సాధారణ కుటుంబాలలో కూడా సహజమయ్యే పరిస్థితికి చేరుకుంటున్నాయి. అంటే ఒక మనిషి ప్రాణం తీయడానికి మరోమనిషి కి ఒక బలమైన కారణం అవసరం లేకుండా పోయింది.

ఒక అక్రమ సంబంధం మనిషి ప్రాణం తీస్తుంది, ఒక ఫెయిల్యూర్ మనిషి ప్రాణం తీస్తుంది, ఒక వ్యసనం మనిషి ప్రాణం తీస్తుంది, ఒక అత్యాశ మనిషి ప్రాణం తీస్తుంది, ఒక కోరిక మనిషి ప్రాణాన్ని కోరుకుంటుంది. ఇలా ప్రతి చిన్న కారణానికి మనిషిని మనిషిని చంపుకుంటూ పొతే చివరికి మిగిలేదెవరు.? వారు సాధించిందేమిటి.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వేదికలపై చెప్పుకుంటే పోయేది పరువు… సమస్యలు కావు!

ప్రస్తుతం సినీ పరిశ్రమ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని చెప్పడానికి నేను భయపడనన్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. అలాగే…

8 minutes ago

Amaravati Boom: Bollywood Takes the Lead Over Tollywood

Andhra Pradesh quickly went from being a capital less state to a state with a…

14 minutes ago