టాలీవుడ్ లో ఈ మార్పు మంచిదేనా.?

తెలుగు రాష్ట్రాల నుంచి టాలీవుడ్ స్థాయి పాన్ ఇండియా వరకు విస్తరించిన మాట వాస్తవం. అయితే ఈ విస్తరణ టాలీవుడ్ లో అనేక మార్పులకు కారణంగా మారిందా.? తెలుగు సినిమా తీసే విధానం, దాన్ని ప్రేక్షకులు చూసే విధానంలో వచ్చిన ఈ మార్పులు టాలీవుడ్ కి మంచి చేస్తున్నాయా.? లేక సమాజానికి చెడు సూచిస్తున్నాయా.?

సహజంగా క్రీస్తు పూర్వం, క్రీస్తు తరువాత అనే మనం టాలీవుడ్ దగ్గరకొచ్చే సరికి ఆఫ్టర్ బాహుబలి బిఫోర్ బాహుబలి అనేలా బాహుబలి, జక్కన్న టాలీవుడ్ దిశా దశను మార్చేసారూ. అయితే టాలీవుడ్ లో వచ్చిన ఈ మార్పు ఒకరకంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

ADVERTISEMENT

కానీ ఆ తరువాత ఈ పాన్ ఇండియా మోజులో పడి టాలీవుడ్ నుంచి వచ్చిన, వస్తున్న కొన్ని సినిమాలు సమాజ పరంగా అనేక విమర్శలను ఎదుర్కొన్నాయి, ఎదుర్కోబోతున్నాయి. ఇందులో ముఖ్యంగా పుష్ప మూవీ. పుష్ప -1,2 అంటూ రెండు పార్ట్ లుగా వచ్చిన ఈ చిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ ని ప్రోత్సహించేలా ఉందంటూ అనేకమమంది నుంచి విమర్శలు ఎదుర్కొంది.

అలాగే పుష్ప – 1 కి గాను అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు రావడం మీద కూడా ఇటువంటి

సనిమాలకు అవార్డులా అంటూ అనేక పుల్లవిరుపు మాటలు ఎదురయ్యాయి. అలాగే దీనికి తోడు ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో మితిమీరిన వైలెన్స్, హద్దులు దాటుతున్న బూతు డైలాగ్స్ కొత్త ట్రెండే గా మారబోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఇందుకు యానిమల్, మార్కో, హిట్ – 3 అంటూ టాలీవుడ్ లో వైలెన్స్ ట్రెండ్ కి తెరలేపారు నయా దర్శకులు. అలాగే తెలుగు సినిమాలో బీప్ సౌండ్స్ కూడా పరిమితి పోతున్నాయనే విమర్శలు టాలీవుడ్ ఎదుర్కోవాల్సి వస్తుంది.

మొన్నిఈమధ్య కిరణ్ అబ్బవరం k – రాంప్ ప్రెస్ మీట్లో ఈ బూతు పురాణాలు గురించి మీడియా వారికి చిత్ర యూనిట్ కి మధ్య ఒక చిన్న పంచాయితీ కూడా నడిచింది. అలాగే హిట్ -3 లో నాని కూడా ఈ నయా ట్రెండ్ ని ఫేలౌ అయ్యారని, దాన్ని పారడైజ్ మూవీ తో మరోలెవెల్ కి తీసుకెళ్లబోతున్నారనేది సినీ విమర్శకుల నుంచి ఎదురవుతున్న విమర్శలు.

ఇక తాజాగా విజయ దేవరకొండ రౌడీ జనార్దన్ మూవీ ట్రైలర్ కూడా కొన్ని బూతు డైలాగ్స్ ఉండడంతో టాలీవుడ్ లో వచ్చిన ఈ మార్పు మంచికా.? లేక సమాజ చెడుకా.? అంటూ సగటు తెలుగు సినీ అభిమాని తెలుగు చిత్ర సీమవైపు వేలెత్తి చూపిస్తున్నాడు. ఇలా అయితే ఇక రానున్న రోజులలో ఫామిలీస్ తో కలిసి సినిమాలు చూసే అవకాశం ఉంటుందా.? అంటూ నిట్టూరుస్తున్నారు.

అలాగే ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ సమయంలో, లేదా ఏదైనా ఈవెంట్ల సమయంలో కూడా స్టేజ్ మీద చిత్ర యూనిట్ చేసే కొన్ని వ్యాఖ్యలు, నటీనటులు మాట్లాడుతున్న భాష లో కూడా ఈ బూతు పదాలు ఎక్కువగా కనిపించడం కాస్త పరిస్థితి నోరు దాటుతుందేమో అనిపించక మానదు.

ఇందుకు మోస్ట్ సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్ ఒక చక్కటి ఉదాహరణగా నిలవగా తాజాగా ఈ కోవలోకి శివాజి కూడా వచ్చి చేరారు. దండోరా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరోహీన్స్ డ్రస్సింగ్ పై శివాజి చేసిన వ్యాఖ్యలు, అందుకు ఆయన ఎంచుకున్న భాష అభ్యన్తరకరంగా ఉంది.

అయితే ఇలా ఆడవారి వస్త్రధారణ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని శివాజీ వ్యాఖ్యల పట్ల మంచు మనోజ్ ఇప్పటికే క్షమాపణలు తెలిపారు. అలాగే మోస్ట్ కాంట్రవర్సీ దర్శకుడు ఆర్జీవీ సైతం శివాజీ తీరును తప్పుబట్టారు. అయితే టాలీవుడ్ లో వచ్చే మార్పు ఏదైనా కానీ తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచేదిగా ఉండాలే కానీ ఇలా తుంచేదిగా ఉండకూడదు అనేది టాలీవుడ్ గ్రహించాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఇంత అలవోకగా తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్!

రాజకీయాలలో ఒక సమస్య లేదా అంశం మీద నుంచి మరో దానికి చర్చ, ప్రజల దృష్టిని ఎంత అలవోకగా మార్చవచ్చో…

51 seconds ago

Video Of The Day: CBN’s Pooja On Modi’s Birthday!

Indian Prime Minister Narendra Modi is the longest serving prime minister in the history of…

17 minutes ago