
* నేడు కక్ష్యలోకి ప్రవేశపెట్టబడిన 104 ఉపగ్రహాల్లో 101 విదేశీ, చిన్న ఉపగ్రహాలే.
* పీఎస్ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) వీటిని మోసుకెళ్లింది. ఈ ఉపగ్రహాల్లో ప్రధాన శాటిలైట్ బరువు 714 కిలోలు కాగా, మిగతా 103 ఉపగ్రహాలూ నానో శాటిలైట్లు. వీటి బరువు 664 కిలోలు.
* నానో శాటిలైట్లు అమెరికా సహా, కజకిస్థాన్, ఇజ్రాయిల్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ం యూఏఈ దేశాలవి ఉన్నాయి.
* గత జూన్ లో ఇస్రో 20 శాటిలైట్లను ఒకే రాకెట్ ద్వారా ప్రయోగించి విజయం సాధించింది. ఇందులో 13 శాటిలైట్లు అమెరికావే కావడం గమనార్హం.
* హాలీవుడ్ చిత్రం ‘గ్రావిటీ’ నిర్మాణానికి అయిన ఖర్చుతో పోలిస్తే, ఎంతో తక్కువ ఖర్చులో 2014లో నాలుగు విదేశీ ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
* ఈ రంగంలో వ్యాపారాన్ని పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్న ఇస్రో, కమర్షియల్ అవకాశాలు అందిపుచ్చుకుంటూ లాభాల బాటన సాగుతోంది. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ రంగంలో ఉన్న కంపెనీలతో పాటు, ఎన్నో దేశాలు టెక్నాలజీ కమ్యూనికేషన్స్ కోసం భారత్ వైపు చూస్తున్నాయి.
* 2013లో మానవ రహిత రాకెట్ ను కేవలం 63 మిలియన్ డాలర్ల ఖర్చుతో మార్స్ మీదకు ఇస్రో ప్రయోగించింది. ఇదే ప్రయోగం అమెరికా చేపడితే అయిన ఖర్చు 671 మిలియన్ డాలర్లు.
* ఇప్పుడిక ఇస్రో లక్ష్యం జూపిటర్, వీనస్ గ్రహాలు. ఈ ప్రయోగం 2012-2022లో జరగనుంది.
* ఇటీవలి బడ్జెట్ లో ఇస్రో కార్యకలాపాల కోసం కేటాయింపులను గత సంవత్సరంతో పోలిస్తే, 23 శాతం పెంచుతున్నట్టు ఆర్థికమంత్రి ప్రకటించారు.
ప్రపంచమే సెల్యూట్ చేసేలా సాధించిన ఈ ఘనత ఇచ్చిన ఉత్సాహంతో మానవసహిత అంతరిక్ష కార్యక్రమాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభించింది. ఇప్పటివరకు అంతరిక్షంలోకి మానవులని పంపిన అనుభవం మన దేశానికి లేదు. భారత వైమానిక దళంతో కలిసి ఇస్రో ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం చేపడుతోంది. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే రష్యా, అమెరికా, చైనాల సరసన భారత్ చేరుతుంది.
అలాగే బ్రహ్మోస్ క్షిపణిని సరిహద్దు వద్ద ఉంచి శత్రుదేశాలు దూకుడును ప్రదర్శిస్తే గట్టి సమాధానం చెబుతామని సంకేతాలు ఇచ్చిన భారత్ మరో ముందడుగు వేస్తోంది. ఈ క్షిపణికి ప్రస్తుతం 300 కిలోమీటర్ల దూరం వెళ్లే సామర్థ్యం ఉంది. అయితే ఆ సామర్థ్య పరిధిని 800 కిలోమీటర్ల దూరం వెళ్లగల వెరైటీని కూడా పరీక్షించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రానున్న మూడేళ్లలో 850 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించేలా చేస్తామని పేర్కొన్నారు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…