
మరిన్ని వివరాల్లోకి వెళితే… తనకు పరిచయమున్న ఓ వ్యక్తి, బార్కస్ లో ఉన్న బాబాకు అద్భుత మంత్ర విద్యలు తెలుసునని, అతని వద్ద డబ్బును రెట్టింపు చేసే యంత్రం ఉందని చెబితే గుడ్డిగా నమ్మేశాడు. యంత్రాన్ని పరీక్షించాలని లక్ష్మణరావు కోరగా, దాన్ని చూపిన బార్కస్ బాబా, తన టక్కు టమార విద్యతో కొన్ని నోట్లను రెట్టింపు చేశాడు. దీంతో అతని మాయలో పడిపోయాడు లక్ష్మణరావు. ఇక ఇదే యంత్రాన్ని మనం కొనుక్కోని 10 వేల కోట్లకు ముంబైలో విక్రయించవచ్చని మధ్యవర్తి చెబితే నమ్మేసాడు.
సరిగ్గా… ఇదే సమయంలో మోడీ సర్కారు ఐడీఎస్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. యంత్రాన్ని తన సొంతం చేసుకుని, ఆపై దాన్ని విక్రయిస్తే, వచ్చే డబ్బును వైట్ మనీ చేసుకోవచ్చన్న ఉద్దేశంతోనే లక్ష్మణరావు తన వద్ద 10 వేల కోట్ల బ్లాక్ మనీ ఉందని ప్రకటించేశాడు. ఇదీ లక్ష్మణరావు బ్లాక్ మనీ వెనకు ఉన్న అసలు కథ. ఇప్పుడు అతనిపై క్రిమినల్ కేసు పెట్టిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం బార్కస్ బాబా, సదరు మధ్యవర్తి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదంతా వింటే… సినిమా కధలు చాలా తక్కువగా కనపడడం సహజమే.
గోదావరి జిల్లాలలో ‘పోలవరం పూర్తికాదు.. ఈ పిల్లకి పెళ్ళి కాదు’ అనే నానుడి వినిపిస్తుంటుంది. నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణం…
Dulquer Salmaan’s latest Malayalam release I’m Game has exposed a worrying trend. Compared with the…