గుడ్ న్యూస్ – త్రివిక్రమ్ సినిమా ఫిక్సయ్యింది!

‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలంటే అయిష్టత ఎంతమందికి ఉంటుంది? దీనికి జవాబు చెప్పాలంటారా? సినిమాలను అమితంగా ఇష్టపడే వారంతా త్రివిక్రమ్ సినిమాలంటే చెవి కోసుకుంటారని చెప్పడంలో సందేహం లేదు. తన అర్ధవంతమైన మాటలతో ఆహ్లాదకరమైన కామెడీని పండించడంలో దిట్ట అయిన త్రివిక్రమ్ సినిమా కోసం నిరీక్షించే అన్ని వర్గాల ఆడియన్స్ ను సంతోషపెట్టే వార్త వెలుగు చూసింది.

నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న “అ… ఆ…” సినిమాను మే 6వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు టైటిల్ లోగోను మాత్రమే విడుదల చేసిన ఈ సినిమా తొలి టీజర్ ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. అలాగే మిక్కీ జే మేయర్ స్వరపరిచిన ఆడియో ఏప్రిల్ రెండవ వారంలో సంగీత ప్రియులను అలరించనుంది. సమ్మర్ బొనంజాగా విడుదల కానున్న “అ…ఆ…” ప్రేక్షకుల చేత నవ్వుల పూలు పూయిస్తుందని అంచనాలు ఉన్నాయి.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Yash vs Prabhas & NTR: Who Has the Biggest Disaster?

The film industry has delivered a lot of hits. But this does not mean that…

3 hours ago

Karthi Describes Sardar 2 as an International Spy Thriller

Sardar 2, starring Karthi, is scheduled for release on September 10. The sequel to Sardar…

3 hours ago