
లోటు బడ్జెట్ కు యూసీలు కావాలి అని కేంద్రం అడుగుతుందని చంద్రబాబు ఎక్కడా అనలేదు. ప్రతీదానికి యూసీల వంక పడుతున్నారని లోటు బడ్జెట్ కు, స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి యూసీలు ఎందుకని మాత్రమే ప్రశ్నించారు. దానిని ఐవైఆర్ కృష్ణారావు గారు తనకు కావాల్సినవిధంగా అర్ధం చేసుకున్నారు.
నిధుల దుర్వినియోగం జరగకపోతే యూసీ ఇవ్వటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి అలాంటప్పుడు ఏపీ ప్రభుత్వం తటపటాయించటం అనుమానాలకు తావిస్తోంది అని అనడం కూడా అభ్యంతరకరమే. రెండు విడతల చేసే సమయానికి కృష్ణారావు ప్రభుత్వంలోనే ఉన్నారు. ఆయనకు తెలీదా నిధుల దుర్వినియోగం జరిగిందా లేదా అనేది? సరే తెలియకపోయినా ఇప్పుడు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన యూసీలు చూసి ఆయన నిర్ధారించలేరా? మనకు నచ్చేవే మన కళ్ళకు కనిపిస్తాయా కృష్ణారావు గారూ?
Abhishek Sharma delivered a standout performance as SunRisers Hyderabad faced Delhi Capitals in IPL 2026…
A few days ago, Vijay's final film, Jana Nayagan directed by H Vinoth was leaked…