Telugu

జాను టీజర్ … నిఖార్సైన రీమేక్?

సమంత, శర్వానంద్ నటించిన జాను ఫస్ట్ లుక్ టీజర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. తమిళంలో బ్లాక్ బస్టరైన 96 అనే రీమేక్ ఇది. టీజర్ చుసిన వారికి సదరు సినిమాను మక్కీకి మక్కీ దింపినట్టుగా అర్ధం అవుతుంది. విజువల్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి. అయితే 96కు త్రిష, విజయ్ సేతుపతి యాక్టింగ్ హైలైట్… సమంత, శర్వా ఎంతవరకూ ఆ స్థాయిని అందుకుంటారో చూడాలి.

ADVERTISEMENT

టీజర్ ను బట్టి సినిమా ఫేట్ ను అంచనా వెయ్యడం కష్టమే అయితే ఖచ్చితంగా సినిమా ప్రమోషన్స్ కు ఇది మంచి స్టార్ట్ అనే చెప్పుకోవచ్చు. ప్ర‌తి ఒక్క‌ళ్ల‌కీ వాళ్ల స్కూల్ డేస్‌ నీ, వాళ్ల తొలి ప్రేమ‌నీ గుర్తు చేసే క‌థ గా ఉంటుంది. `దూరం వెళ్లిపోయావా రామ్` అని స‌మంత అడగ్గా… `నిన్ను ఎక్క‌డ వ‌దిలేశానో.. అక్క‌డే ఉన్నా ` అని శ‌ర్వానంద్ చెబుతాడు. ప్రేమ‌కి స‌రిహ‌ద్దులు, ష‌ర‌తులు లేవ‌ని చెప్పే క‌థ ఇది.

ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు నిర్మాతగా రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు ఒరిజినల్ వర్షన్‌ 96 కు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ సంగీత దర్శకుడు గోవింద వసంత సంగీతమందిస్తున్నాడు.

చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన చిత్రీకరణ సమయంలో పార్‌గ్లైడింగ్‌చేస్తూ శర్వానంద్‌ గాయపడటంతో సినిమా ఆలస్యమైంది. 2017లో వచ్చిన మహానుభావుడి తరువాత శర్వానంద్ కు హిట్ లేదు దానితో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అతను కృతనిశ్చయంతో ఉన్నాడు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Pan-India Hero Exposing More Than Heroine? What’s Cooking!

A new inside news related to a big budget Pan-India South movie has surfaced online.…

5 minutes ago

Viral Video: CM Goes To Former CM’s House!

Generally, South Indian politics are extremely direct as the ruling and opposing factions can’t face…

24 minutes ago