
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. అయితే ప్రస్తుత సోషల్ మీడియా జమానాలో ఈ అవకాశాన్ని కొంతమంది చాల సులువుగా అందుకుంటున్నారు.
అయితే ఇటు సోషల్ మీడియా క్రేజ్ తో కాకూండా ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా తమ సొంత కష్టంతో అడుగుపెట్టి, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, హీరోగా అవకాశం కోసం కొన్నేళ్ల పాటు నిరీక్షణ చేసి చివరికి వచ్చిన ఆ ఒక్క ఛాన్స్ అందుకుని తమను తాము హీరో గా నిరూపించుకున్నారు యువ నటులు విశ్వక్ సేన్, సిద్దు జొన్నల్ల గడ్డ.
అయితే ఈ ఇద్దరు టాలీవుడ్ కుర్ర హీరోలు అటు దర్శకుడిగా, స్క్రీన్ రైటర్ గా, ఇటు హీరోలుగా మల్టీ టాలెంట్ తో సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నగరానికి ఏమైంది మూవీ తో విశ్వక్ యూత్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యితే డీజే టిల్లు తో సిద్దు స్టార్ బాయ్ గా ఎదిగారు.
ఇక ఫలకనామ దాస్ తో తనలో ఉన్న దర్శకుడిని కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి మంచి విజయాన్ని అందుకున్నారు విశ్వక్. అలాగే గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో సహా రచయితగా, హీరోగా కనిపించారు సిద్దు. అయితే వీళ్లిద్దరు కూడా తమ కష్టంతో, తమ టాలెంట్ తో ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇప్పుడు ఒక స్థాయికి వచ్చారు.
అయితే కెరీర్ మీదకన్నా కాంట్రవర్సీల పై ఎక్కువగా ఫోకస్ అయిన విశ్వక్ లైలా మూవీ తో ఊహించని డిజాస్టర్ ను అందుకున్నారు. ఈ మూవీ విదులైన తరువాత విశ్వక్ ఎంచుకుంటున్న సినీ స్క్రిప్ట్ లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిపడ్డాయి. చివరికి విశ్వక్ తన అభిమనులకు ఒక క్షమాపణ లేఖ విడుదల చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇక సిద్దు విషయానికొస్తే టిల్లు సిరీస్ తో సిద్దు వరుసగా రెండు భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుని స్టార్ బాయ్ టాగ్ తో మంచి ఫామ్ లో కొచ్చారు. అయితే సిద్దు లేటెస్ట్ మూవీ జాక్ సిద్దు కెరీర్ కు స్పీడ్ బ్రేకర్ మాదిరి బ్రేక్ వేసిందనే చెప్పాలి. వైష్ణవి చైతన్య తో కలిసి రా ఎంజెంట్ గా చేసిన జాక్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేకపోయింది.
సిద్దు ఇంకా టిల్లు క్యారెక్టర్ లో నుంచి బయటకు రాలేదా.? లేక ప్రేక్షకులు అటువంటి క్యారెక్టర్ ను ఆదరించారు కాబట్టి ఇక అదే టెంప్లెట్ లో సిద్దు తన కెరీర్ ను తీసుకువెళ్లానుకున్నారో కానీ జాక్ ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. దీనితో ఇండస్ట్రీలో అవకాశాలు రావడమే కాదు వాటిని విజయాలు గా మలచుకోవడం, ఆ విజయాలను తిరిగి కొన్నాళ్ల పాటు కొనసాగించడం కూడా కష్టమే.
అయితే మరో మంచి మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు విశ్వక్, సిద్దు ఇద్దరు కూడా అదిరిపోయే కం బ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం.
Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…