
ఓ నిర్దిష్ట లక్ష్యాన్ని గురిచూసి సంధించిన బాణం ఆ లక్ష్యాన్ని ఛేదించకపోయినా పరవాలేదు కానీ అది మరెవరికో గుచ్చుకుంటేనే ప్రమాదం.
అలనాడు శ్రీరాముడు రామబాణం సందిస్తే అది శత్రువుని సంహరించి తిరిగి అమ్ములపొదిలో చేరుకునేదని మన పురాణాలు చెపుతుంటాయి. మళ్ళీ ఇన్ని యుగాలు తర్వాత.. అంత గొప్ప విలుకాడు మన ఆంధ్రాలోనే పుట్టాడు!
కాకపోతే ఒకటే తేడా ఈయన సంధించిన బాణాలు ఎన్నడూ లక్ష్యాన్ని ఛేదించిందీ లేదు.. పైగా తిరిగివచ్చి ఆయనతో పాటు అందరికీ గుచ్చుకుంటాయి.
ఆ విలుకాడు ఎవరో వేరే చెప్పాలా? ఇంకెవరూ మన మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డే.
ఆయన సంధించిన బాణాన్నని చెల్లి వైఎస్ షర్మిల గర్వంగా చెప్పుకునేవారు. ఆ బాణం ఆంధ్రా-తెలంగాణ రెండు రాష్ట్రాలు చుట్టబెట్టేసి గురితప్పి మళ్ళీ వచ్చి జగన్‌కే గుచ్చుకుంటోంది.
ఇక మరో బాణం ఢిల్లీ దాకా పయనించి అక్రమాస్తుల కేసుల మొదలు వివేకా కేసు వరకు అన్ని రకాల కేసులను సమర్ధంగా అడ్డుకుంది. ఆ బాణం పేరు విజయసాయి రెడ్డి.
అది కూడా తిరిగి వచ్చి జగన్‌కే గుచ్చుకుంటోంది. ఇంకా ఇలాంటి చిన్నా పెద్ద బాణాలు చాలానే ఉన్నాయి. అన్నీ తిరిగి వచ్చి జగన్‌కి, వైసీపీలో వారికి, వారితో అంటకాగిన వారికే గుచ్చుకుంటున్నాయి.
జగన్ సంధించిన బాణాలు లక్ష్యం ఛేదించకపోతే పాయే కానీ తిరిగి వచ్చి ఎందుకు గుచ్చుకుంటున్నాయి?అని ఆలోచిస్తే జగన్ అహంకారం, దురాశ, కపట ధోరణే కారణమని చెప్పక తప్పదు.
తల్లిని, చెల్లిని, బాబాయ్ వంటి ఆత్మీయులను కూడా జగన్ దూరం చేసుకున్నారు. ఒకవేళ వేర్వేరు కారణాలతో వారిని దూరం చేసుకున్నా, జగన్ కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలాగే తన అహంకారం విడిచిపెట్టి, తన తప్పులని గుర్తించి సరిదిద్దుకొని వారందరినీ ఆహ్వానిస్తే రాకుండా ఉంటారా?
కానీ జగన్ తన ఇగో చంపుకోలేక వారిని శత్రువుల జాబితాలో చేర్చేసి అవమానించారు. అందుకే జగన్ సంధించిన ప్రతీ బాణం వెనక్కు తిరిగి వచ్చి పదేపదే గుచ్చుకుంటోంది. వైఎస్ షర్మిల, విజయసాయి రెడ్డి ఇందుకు నిలువెత్తు నిదర్శనాలు కారా?
Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…