
కేంద్రవాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం దేశంలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్న రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించారు. వాటిలో తెలంగాణ రెండో స్థానంలో నిలువగా, చిట్టచివరి స్థానంలో బిహార్, ఆంధ్రప్రదేశ్, మిజోరాం, లద్దాఖ్ నిలిచాయి. ఆ చివరి స్థానంలో కూడా బిహార్ కంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబడటం మరో విశేషం!
అసలు సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హయాంలో హైదరాబాద్లో ఐటి రంగానికి పునాదులు పడ్డాయి. ఐటి రంగం బంగారు గుడ్లు పెట్టే బాతువంటిదని ఆనాడే చంద్రబాబు నాయుడు గుర్తించి హైదరాబాద్లో ఐటి కంపెనీలకు మౌలికసదుపాయాలు కల్పించి వాటిని రప్పించారు.
ఏపీ, తెలంగాణలు విడిపోయిన తరువాత విశాఖ నగరాన్ని ఐటీ-హబ్గా తీర్చిదిద్దేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూడా హైదరాబాద్లోని ఐటి కంపెనీలను జాగ్రత్తగా కాపాడుకొంటూనే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు స్టార్టప్ పాలసీ ప్రకటించి, టీ-హబ్లు ఏర్పాటు అనేక వందల స్టార్టప్ కంపెనీలు నిలద్రొక్కుకొనేందుకు అన్ని విదాల తోడ్పడింది.
అయితే ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ప్రాధాన్యతలు వేరేగా ఉండటంతో స్టార్టప్ కంపెనీల ఆలోచన చేయకుండా, రాజకీయ కక్ష సాధింపులు, మూడు రాజధానులు, సంక్షేమ పధకాలు, వాటి కోసం అప్పులు, ప్రభుత్వ భూముల వేలంపాటలతో మూడేళ్ళు గడిపేసింది. ప్రభుత్వ సహాయసహకారాలు కరువవడంతో అప్పటికే విశాఖ నగరంలో ఉన్న కొద్దిపాటి ఐటి కంపెనీలలో కొన్ని హైదరాబాద్కు తరలిపోయాయి. అందుకే ఏపీలో ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్దులు ఐటి ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్ళవలసివస్తోంది.
ఈ హడావుడిలో మునిగితేలుతున్న జగన్ సర్కార్ స్టార్టప్ అనే ఆలోచనే కూడా చేసినట్లు లేదు. అందుకే దేశంలో అన్ని రంగాలలో వెనుకబడి అరాచకం తాండవించే బిహార్ రాష్ట్రం సరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ఈ క్రెడిట్ పూర్తిగా జగన్ సర్కారుదే… దీనిలో ఎవరికీ వాటాలు ఉండవు!
కోటికిపైగా జనాభా ఉన్న రాష్ట్రాలు, కోటికంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రభుత్వాలు రూపొందించుకొని అమలుచేస్తున్న స్టార్టప్ పాలసీలను, అవి స్టార్టప్ కంపెనీలు నిలదొక్కుకోవడానికి ఇస్తున్న అండదండలు వంటి వివిద అంశాలను ప్రామాణికంగా తీసుకొని కేంద్రప్రభుత్వం 5 కేటగిరీలు విభజించి ర్యాంకులు ప్రకటించింది.
అవి మెగాస్టార్స్ (బెస్ట్ పెర్ఫర్మర్స్), సూపర్ స్టార్స్ (టాప్ పెర్ఫార్మర్స్), స్టార్స్ (ది లీడర్స్), రైజింగ్ స్టార్స్ (యాస్పైరింగ్ లీడర్స్), సన్రైజర్స్ (ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్) ర్యాంకులు ప్రకటించింది.
మెగాస్టార్స్: గుజరాత్, కర్నాటక
సూపర్ స్టార్స్: తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, కేంద్రపాలిత ప్రాంతమైన కశ్మీర్
రైజింగ్ స్టార్స్: తమిళనాడు, యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, అస్సాం, గోవా, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు
సన్ రైజర్స్: బీహార్, ఆంధ్రప్రదేశ్, మిజోరాం, లద్దాఖ్.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…