
అయితే ఈ సమయంలో విజయవాడ టీడీపీ ఎంపీ ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “మన కలలు మనమే సాకారం చేసుకోవాలి మన కలలు ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం అమరావతి @ncbn ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కన్న కల అది సాకారం అవ్వాలంటే 2024 లో @JaiTDP అధికారంలోకి రావాలి ఆ దిశగా పార్టీలో అందరూ పాటుపడాలి మీడియా సమావేశాల వల్ల పేపర్ స్టేట్మెంట్స్ వల్ల ప్రయోజనం లేదు,” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
నిజమే చంద్రబాబు కలను జగన్ ఎందుకు సాకారం చేస్తారు? కలలు కనడం తప్పేమీ కాదు. పెద్ద పెద్ద ఆశయాలు ఉండటమూ కాదు. అయితే తనకు అవకాశమిచ్చిన ఐదు సంవత్సరాలలో నెరవేరేలా కలలు కనాల్సింది. లేదా ఆ కల సాకారం అవ్వడానికి మరో పదిహేనేళ్ల పాటో , లేక ఇరవై ఏళ్ళ పాటో అధికారంలో తానే ఉండేలా ప్రయత్నం చేసుకోవాల్సింది.
అయితే రాజధానికి భూములిచ్చిన రైతుల పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది. తాము అధికారంలోకి వస్తే రాజధాని మళ్ళీ అమరావతికి తరలిస్తాం అని చెప్పగలిగే ధైర్యం టీడీపీకి ఉంటే అక్కడి ప్రజలు ప్రభుత్వానికి భూములు ఇచ్చే విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…