
గతంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చిన వారే. కాబట్టి జగన్ ఆశలన్ని ఈ పాదయాత్ర పైనే. ఐతే పాదయాత్ర అనేది బాగా ఖర్చుతో కూడుకున్న పని అవ్వడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నిధుల సమీకరణ బాధ్యత విజయ సాయి రెడ్డికి అప్పగించింది.
ఆయన పార్టీ నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారని వివిధ మీడియా చ్యానెల్ రెపోర్ట్‌లు చెప్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీట్లు ఆశించేవాళ్ళు కొంత పార్టీ ఫండ్ ఇవ్వాలని విజయసాయిరెడ్డి వాళ్ళని అడుగుతున్నారట. ఐతే ఎన్నికలు ఇంకా రెండు సంవత్సరాలు ఉండటంతో ఇప్పుడే ఖర్చుకు నాయకులు సిద్ధంగా లేరు అని సమాచారం.
పాదయాత్రతో పాటు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడానికి ఒక ప్రత్యేక విమానం సిద్ధం చెస్కోవాల్సిన పరిస్థితి. కనీసం మూడు నెలల పాటు కోర్టు హాజరు మినహాయింపు కోసం జగన్ వేచిచూస్తున్నారు. అది రాని పక్షంలో ఆ ఖర్చు కూడా ఉంటుంది. 120 నియోజకవర్గాల పాదయాత్ర తరువాత జగన్ 50 నియోజకవర్గాలలో బస్సు యాత్ర చెయ్యనున్నారు. తద్వారా అన్ని నియోజకవర్గాలు కవర్ చెయ్యాలని ఆయన ప్లాన్.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…