
ఆ క్లిప్ వైరల్ అవ్వడంతో వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు జీ తెలుగు మీద, సదరు ఆర్టిస్టు మీద, నాగబాబు మీద, శ్రీముఖి మీద బూతులతో విరుచుకుపడుతున్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే… జగన్ ను టార్గెట్ చెయ్యడం మొదటి సారేమో గానీ ఇది తరచు జరుగుతున్నదే.
ఎన్నికల ముందు మధ్య చంద్రబాబు మీద నందమూరి కుటుంబం మీద ఇదే వైఎస్సార్ కాంగ్రెస్ రామ్ గోపాల్ వర్మ తో ఒక సినిమా కూడా తీయించారు. దానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఒకరితో ఫైనాన్స్ కూడా చేయించారు. అప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా ఆనందించారు.
ఇప్పుడు తమదాకా వచ్చే సరికి బాధపడిపోతున్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు మెగా ఫామిలీలోని ఆడవారిని సైతం వదలకుండా బూతులు తిట్టేస్తున్నారు. అటువంటి ఎజెండాతో కూడుకున్న సినిమాలను, షోలను ఆదరిస్తే లేదా ప్రోత్సహిస్తే ఎప్పుడో ఒకప్పుడు తమకు కూడా తగులుతాయని గుర్తించకపోవడం వల్ల జరిగింది ఇది. ఇప్పటికైనా తెలుసుకుంటారో లేక మేము ఎన్నైనా ఎవరినైనా అనొచ్చు మమ్మల్ని మాత్రం అనకూడదు అని సరిపెట్టుకుంటారో చూడాలి.
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…