
ఇంత శక్తివంతుడైన ముఖ్యమంత్రి విదేశానికి వెళ్ళాలంటే సిబిఐ అనుమతి పొందాల్సిరావడం చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది వాస్తవం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28వ తేదీన వ్యక్తిగత పర్యటనగా పారిస్ నగరానికి వెళ్ళబోతున్నారు. ముఖ్యమంత్రి పెద్ద కుమార్తె హర్షారెడ్డి అక్కడ ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. జూలై 2వ తేదీన జరిగే కాన్వోకేషన్ కార్యక్రమంలో ఆమె డిగ్రీ పట్టా అందుకోబోతున్నారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకే సిఎం జగన్మోహన్ రెడ్డి పారిస్ వెళ్ళాలనుకొంటున్నారు.
అయితే అక్రమాస్తుల కేసులలో సిబిఐ కోర్టు ఆయనను బెయిల్పై విడుదల చేస్తున్నప్పుడు దేశం విడిచి వెళ్లరాదనే షరతు విధించినందున, పారిస్ వెళ్ళేందుకు అనుమతివ్వాలని కోరుతూ సిబిఐ కోర్టుకు దరఖాస్తు చేసుకొన్నారు. ఈ నెల 28 నుంచి వారం రోజుల పాటు విదేశానికి వెళ్ళి వచ్చేందుకు అనుమతించాలని సిఎం జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుని అభ్యర్ధించారు.
రాష్ట్రంలో ఓ సాధారణ పౌరుడు ఎటువంటి ఆంక్షలు, అనుమతులు అవసరం లేకుండా దేశవిదేశాలకు వెళ్ళి రాగలడు. కానీ సర్వశక్తివంతమైన ఓ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళాలంటే సిబిఐ కోర్టు అనుమతి పొందాల్సి రావడం ఆశ్చర్యంగానే ఉంటుంది. సిఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరగానే ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలు, ఆరోపణలు చేస్తుంటాయి. ఈ అక్రమాస్తుల కేసుల విచారణ ఏళ్ళ తరబడి సాగుతూనే ఉన్నాయి తప్ప ఓ కొలిక్కి రావడం లేదు. కనుక సిఎం జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళాలనుకొన్న ప్రతీసారి ఈ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోక తప్పడం లేదు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…