బాలయ్య కోసం మళ్లీ బాబు

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 99వ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య 99వ సినిమా ‘డిక్టేటర్‌’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాలున్న ‘డిక్టేటర్‌’ విడుదల అయిన తర్వాత తన ప్రతిష్టాత్మక 100వ సినిమాను బాలయ్య ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశాడు. తనకు రెండు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య తన 100వ సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం అందుతోంది.

బాలకృష్ణ, బోయపాటిల కాంబినేషన్‌లో వచ్చిన ‘లెజెండ్‌’ ఏస్థాయి సక్సెస్‌ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో బాలయ్యకు సరైన పోటీగా విలన్‌ పాత్రలో జగపతిబాబు నటించాడు. తాజాగా తన 100వ సినిమాలో కూడా జగ్గూ బాయ్‌ని విలన్‌గా నటింపజేయాలని బాలయ్య ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. సెంటిమెంట్స్‌ను బాగా నమ్మే బాలయ్య సక్సెస్‌ కోసం జగపతిబాబుతో మరోసారి తలపడాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం బన్నీ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న బోయపాటి ఆ తర్వాత బాలయ్య సినిమాను మొదలు పెట్టనున్నాడు. వచ్చే సంవత్సరం వేసవికి బాలయ్య 100 సినిమా స్క్రిప్ట్‌ రెడీ అవ్వనుంది. త్వరలోనే బాలయ్య 100వ సినిమాపై ఒక అధికారిక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని నందమూరి ఫ్యాన్స్‌ అంటున్నారు.

Share
Published by

Recent Posts

Pakistan’s India Win Backfired? Ex-Captain’s Bombshell

Former Pakistan captain Mohammad Yousuf has linked the team’s recent struggles to their famous 10…

8 minutes ago

KTR Uses Jagan’s Famous Dialogue Again?

Why is Jagan is unusually good when it comes to picking interesting coin terms. There…

38 minutes ago